కృష్టా జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలలో అయిదుగురు అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: కృష్టా జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలలో అయిదుగురు అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, బైకులు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో నలుగురు అంతర్‌రాష్ట్ర బ్యాంక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని చిత్తూరు, తమిళనాడులకు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 32 లక్షల 84 వేల రూపాయల నగదు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పోలీసులు ఒక అంతర్‌రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 34 సవర్ల బంగారం, 10 తులాల వెండి, 25 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఒక వ్యక్తి నుంచి 900 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి బ్యాంకాక్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.