ఏలూరు సిటీ :ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో పశ్చిమ వికసించింది...నవాంధ్రప్రదేశ్‌గా అవతరించాక తొలిసారి జిల్లా విద్యార్థులు తమ సత్తా చాటుకున్నారు. రాష్ట్రస్థాయిలో కృష్ణా 76శాతం ఉత్తీర్ణతతో టాపర్‌గా నిలిస్తే...68 శాతం ఉత్తీర్ణత సాధించి పశ్చిమ, విశాఖ, నెల్లూరు జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. గత ఏడాదితో పోలిస్తే పశ్చిమగోదావరి జిల్లా ఉత్తీర్ణతలో 10 శాతం పెరిగింది. గత ఏడాది పశ్చిమ 58 శాతంతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిస్తే ఈసారి మూడు స్థానాలు ఎగబాకింది. ఇక 72 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు బాలుర కంటే పైచేయి సాధించారు. జిల్లాలో జనరల్ కోర్సులకు సంబంధించి 29,993 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 20,465మంది పాస్ అయ్యారు. వోకేషనల్ కోర్సులకు సంబంధించి 3,097మంది పరీక్షలు రాస్తే 44 శాతంతో 1,366 మంది ఉత్తీర్ణులు అయ్యారు.
సత్తా చాటిన జిల్లా
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ విద్యాసంవత్సరానికి ఫస్ట్ ఇంటర్ పరీక్షల్లో 20,465 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వారిలో బాలురు 13,515 మంది పరీక్షలు రాయగా 64 ఉత్తీర్ణతా శాతంతో 8,677 మంది పాస్ అయ్యారు. బాలికలు 16,478 మంది పరీక్షలకు హాజరు కాగా 72 శాతంతో 11,788 మంది కృతార్థులయ్యారు. ఇక వోకేషనల్ కోర్సులకు సంబంధించి 3,097 మంది పరీక్షలు రాస్తే 1,366 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 1,735 మంది పరీక్షలు రాస్తే 40శ ాతంతో 686 మంది పాస్ కాగా, బాలికలు 1362 మంది పరీక్షలు రాయగా 50 శాతంతో 680 మంది ఉత్తీర్ణత సాధించారు.
బాలికలదే హవా
ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో బాలికలు మరోసారి హవా సాగించారు. గత విద్యాసంవత్సరంలో బాలుర కంటే 9 శాతానికి పైగా అధిక ఉత్తీర్ణత సాధించిన బాలికలు ఈ సంవత్సరం 8 శాతం ముందున్నారు. గత ఏడాది బాలురు 53 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 62 శాతం మంది పాస్ అయ్యారు. ఈ ఏడాది కూడా బాలురు 64 శాతం ఉత్తీర్ణులైతే బాలికలు 72 శాతం మంది పరీక్షల్లో కృతార్థులయ్యారు.
పక్కా ప్రణాళికతోనే
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రంలోనే మంచి ఉత్తీర్ణతా శాతాన్ని నమోదు చేశారు. మొదటి నుంచీ పక్కా ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాలు సాధించాం. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఇదే స్థాయిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయి. మే 27 నుంచి జూన్ 2వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం.
- ఆర్‌ఐవో బి.వెంకటేశ్వరరావు
ఇంటర్‌లో పశ్చిమ ‘సెకండ్’
Published Fri, Apr 24 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement