సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు వచ్చే నెల 19లోపు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్ష ఫీజు రూ. 290, ప్రాక్టికల్ పరీక్షలకు అదనంగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్‌లో చేరిన తర్వాత 5 సంవత్సరాల లోపు పరీక్షల్లో ఉత్తీర్ణులు కానివారు తిరిగి మొత్తం పరీక్షలు రాయాలన్న నిబంధనను తొలగించినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. కేవలం ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే రాస్తే సరిపోతుందని పేర్కొంది.
‘అడహక్ ఫీజు’ నివేదికలకు గడువు పొడిగింపు
వ్యయ నివేదికలు సమర్పించని ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కళాశాలలకు తాత్కాలికంగా అడహక్ ఫీజును ఖరారు చేసి సెప్టెంబరు 30లోగా వ్యయ నివేదికలు సమర్పించాలని అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ గతంలో ఆదేశించింది. అయితే ఇప్పటివరకూ సంబంధిత వృత్తివిద్యా కళాశాలలు వ్యయ నివేదికలు సమర్పించలేదు. గడువు పొడిగించాలని కోరడంతో గురువారం ఈ అంశాన్ని కమిటీ సమీక్షించి అక్టోబర్ 15 వరకూ పొడిగించిందని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.
నేటితో ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ముగింపు
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 24 నుంచి జరుగుతున్న ఎంసెట్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు తుది విడతలో 36 వేల మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్నట్టు సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇంటర్ పరీక్ష ఫీజుకు గడువు అక్టోబరు 19
Published Fri, Sep 27 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement