వచ్చే రబీ సీజన్ లో గోదావరి డెల్టా పరిధి కింద ఉన్న 8 లక్షల 96 వేల 533 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు తీర్మానించింది.
కాకినాడ: వచ్చే రబీ సీజన్ లో గోదావరి డెల్టా పరిధి కింద ఉన్న 8 లక్షల 96 వేల 533 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు తీర్మానించింది. రబీకి గోదావరి ద్వారా 65 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బోర్డు తెలిపింది.
మరో 16 టీఎంసీల నీరు కొరత ఉన్న నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించింది. ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు రబీలో పూర్తిస్థాయిలో నీరు అందించాలని, విశాఖపట్నంకు తాగునీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు.