
'నిధుల్లేకుండా ప్రాజెక్టులెలా పూర్తి చేస్తారు..'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుగా పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారు, ఇప్పుడేమో ప్యాకేజీ ఇస్తామంటున్నారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి పోలవరం కోసం పోరాడుతోందని పునరుద్ఘాటించారు. నిధులు కేటాయించకుండా హంద్రీ-నీవా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని మిధున్ రెడ్డి అన్నారు.