ఇది అబద్ధాల ప్రభుత్వం | It is the liar government | Sakshi
Sakshi News home page

ఇది అబద్ధాల ప్రభుత్వం

Published Wed, Dec 17 2014 3:22 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

It is the liar government

కడప కార్పొరేషన్: అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికీ అవే అబద్దాలు చెబుతూ పాలన సాగిస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శంకరాపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహిస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఆయన సంఘీభావం ప్రకటించారు.
 
 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకుముందు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేయకపోవడం అన్యాయమన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయివుంటే ఈపాటికి కార్మికులందరూ పర్మినెంట్ అయి ఉండేవారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో 16 వేల మంది కార్మికులు 18 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆర్టీసీలో మజ్దూర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 24 వేలమంది కార్మికులను పర్మినెంట్ చేశారని గుర్తు చేశారు. ఈనెల 18వ తేది అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, ఆ సమావేశాల్లో కార్మికులు డిమాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వైఎస్‌ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగారెడ్డి, కాంట్రాక్టు కార్మికుల యూనియన్ నాయకులు మల్లికార్జున, కిశోర్, కార్మికులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement