విశాఖ జిల్లా మధురవాడ ఐటీ సెజ్‌ను ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మంగళవారం పర్యటించారు.
విశాఖ: విశాఖ జిల్లా మధురవాడ ఐటీ సెజ్‌ను ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మంగళవారం పర్యటించారు. జిల్లాలో ఐటీ హబ్ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ పర్యటిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుడు జె సత్యనారాయణ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్, ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, పరిశ్రమల అభివృద్ధి ఫోరం చైర్మన్ జె.ఎ.చౌదరి తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఐటీ పరిశ్రమల అభివృద్ధిపై మంత్రి ఈరోజు ఉదయం 11.30 గంటలకు వీటా, రిట్పా సంఘాల ప్రతినిధులతో చర్చించనున్నారు.