జనమే జనం | jagan mohan reddy Road Show in Tirupati | Sakshi
Sakshi News home page

జనమే జనం

Published Sun, Mar 2 2014 6:15 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

జనమే జనం - Sakshi

జనమే జనం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మోగించిన ఎన్నికల జనభేరి, రోడ్‌షోలతో శనివారం తిరుపతి నగరం దద్దరిల్లింది.

  •     రోడ్‌షోకు అపూర్వస్పందన
  •      ప్రతి మహిళను పలకరిస్తూ ముందుకు
  •      జగన్‌కు సమస్యలు చెప్పిన వృద్ధులు, వికలాంగులు
  •      డప్పువాయించినజననేత
  •   సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మోగించిన ఎన్నికల జనభేరి, రోడ్‌షోలతో శనివారం తిరుపతి నగరం దద్దరిల్లింది. జననేతకు తిరునగరి ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. తిరుపతిలో అడుగడుగునా పూలు చల్లుతూ, పూలదండలు వేస్తూ, శాలువాలు కప్పుతూ, మంగళహారతులు ఇస్తుండగా జగన్ రోడ్‌షో సాగింది. రోడ్‌షో సందర్భంగా పార్టీశ్రేణులు, అభిమానులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువత, విద్యార్థులు ఇలా అన్నివర్గాలు వీధుల్లో జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు బారులు తీరారు.
     
    శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతి చేరుకున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమన కరుణాకరరెడ్డి గృహానికి చేరుకున్నారు. అక్కడ టీ తాగి ఉదయం 9.30 గంటలకు లక్ష్మీపురం సర్కిల్ చేరుకుని రోడ్‌షో ప్రారంభించారు. రోడ్‌షో ఒక్కొక్క జంక్షన్ దాటేందుకు దాదాపు గంటకుపైగా పట్టింది. కొన్నిచోట్ల రోడ్లకు అన్నివైపుల నుంచి అభిమానులు, పార్టీశ్రేణులు జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలని రోడ్లపైకి రావటంతో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్‌షో ప్రారంభం నుంచి ముగిసేవరకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని పక్కన పెట్టుకుని జననేత ప్రజలను కలుస్తూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కె.నారాయణస్వామి రోడ్‌షోలో వైఎస్.జగన్ వెంటే ఉన్నారు.
         
    ఉదయం 9.40 గంటలకు లక్ష్మీపురంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో ప్రారంభమైంది. రోడ్‌షోలో పాల్గొనేందుకు సర్కిల్ చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు జగన్ కాన్వాయ్‌కి ఎదురెళ్లి ఆహ్వానించారు. ఈ సర్కిల్‌లో తిరుపతి బాలాజీ మోటార్ సైకిల్స్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటిస్థలాలకోసం జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి రాగానే సొంతింటి కల నెరవేరుస్తామని వైఎస్.జగన్ హామీ ఇచ్చారు.
         
    టీవీఎస్‌షోరూం సర్కిల్ వద్ద మన్నెం చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మునిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి తమ విద్యార్థులతో కలిసి జగన్ ఫ్లెక్సీలు పట్టుకుని స్వాగతించారు. ఇక్కడ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలను ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ, ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. మైనారిటీ నాయకులు నూరుల్లా ఆధ్వర్యంలో ముస్లింలు జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఇక్కడే దాదాపు గంటకు పైగా సమయం పట్టింది.
         
    గాంధీపురం సర్కిల్‌లో వైఎస్సాఆర్ సీపీ నాయకులు ఎస్‌కే.బాబు, తాళ్లూరి ప్రసాద్, అమరనాథరెడ్డి, సతీష్ ఆధ్వర్యంలో దళితులు, మైనారిటీలు, మహిళలు పూలు చల్లి, హారతులు ఇస్తూ జననేతను ఆహ్వానించారు. పలకలు వాయిస్తూ నృత్యాలు చేశారు. ైతమ అభిమాన నాయకుడికి దళితసోదరులతో కలిసి ఎస్‌కే.బాబు తిరుపతి సంప్రదాయ వాయిద్యమైన పలక(డప్పు)ను బహుకరించారు. అభిమానుల కోరిక మేరకు జగన్ డప్పు వాయించి బాగుందని ప్రశంసించారు.
         
    ఉదయం 11.15 గంటలకు గ్రూప్ థియేటర్స్ వద్దకు రోడ్‌షో చేరుకుంది. అనంతరం పెద్దకాపు వీధి జంక్షన్ వద్ద జగన్‌మోహన్‌రెడ్డికి నాయకులు దొడ్డారెడ్డి మునిశేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, గురవారెడ్డి స్వాగతంపలికారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement