అయ్యప్ప దీక్ష మాదిరి జలదీక్ష: చంద్రబాబు | Jaladeeksha like Ayyappa deeksha: Chandrababu | Sakshi

అయ్యప్ప దీక్ష మాదిరి జలదీక్ష: చంద్రబాబు

Published Sat, Apr 25 2015 4:12 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లుగానే తాను జలదీక్ష తీసుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఒంగోలు: భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లుగానే తాను జలదీక్ష తీసుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన ముగిసింది. ఆయన ఈరోజు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. మునగనూరు మండలం పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు, తాగు నీరు అందించేవరకు జలదీక్ష విరమించను అని చెప్పారు.

డ్వాక్రా రుణాలను దశలవారీగా మాఫీ చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను పూర్తి చేసి, తానే ప్రారంభిస్తానన్నారు. నదుల అనుసంధానంలో భాగమే పట్టిసీమ ప్రాజెక్టు అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిందని చంద్రబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement