‘ఖర్మ’భూమి!
వంగర: మండల పరిధిలోని కొండచాకరాపల్లిలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారిం ది. గ్రామంలోని వైఎస్‌ఆర్ సీపీ అభిమానుల పింఛన్లతోపాటు అర్హులైన వృద్ధు లు, వితంతువుల పింఛన్లను పంచాయతీ కార్యదర్శి సహకారంతో స్థానిక టీడీపీ నాయకులు తొలగించారని బాధిత లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కార్యదర్శి జగ్దల్ కాలర్ పట్టుకుని లబ్ధిదారులు లాక్కొని వెళ్లడంతో రభస మొదలైంది. ఒక్కొక్కరుగా గుమిగూడి వర్గాలుగా విడిపోయి తమ పింఛన్లను పార్టీ కక్షతో తొలగించారని జెడ్పీటీసీ సభ్యుడు బొత్స వాసుదేవరావునాయుడు, ఎంపీటీసీ ప్రతినిధి బెవర రమేష్‌లను స్థానిక సర్పంచ్ ప్రతినిధి పారిశర్ల రామకృష్ణ, వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గొడవతో సభాప్రాంగణమంతా దద్దరిల్లింది. ఈ దశలో ఎస్‌ఐ కె.శాంతారామ్, పోలీస్ సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావునాయుడు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగదని, పార్టీలకు అతీతంగా పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిం చారు. అనంత రం పలువురికి పింఛను సొమ్మును పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మీసాల విజ య్‌భాస్కర్, సూపరింటెండెంట్ జి.కాశీవిశ్వనాథంతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
కొత్తకోటలో...
లావేరు : మండలంలోని కొత్తకోట పంచాయతీలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అర్హుల పింఛన్లను ఎందుకు తొలగించారంటూ అధికారులను వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రొక్కం బాలకృష్ణ నిలదీశారు. కేవలం తమ పార్టీ అభిమానుల పింఛన్లనే రద్దు చేశారని ఆరోపించారు. దీనిపై టీడీపీ నాయకులు శ్రీరామమూర్తి, సాంబశివరావు కలుగజేసుకుని పింఛన్ల రద్దులో రాజకీయ కారణాలంటూ ఏమీ లేవని చెప్పగా, అందులో ఓ వ్యక్తి మాత్రం అంతా మేము చెప్పినట్లే అన్నీ జరుగుతుందని, ఏంచేసుకుంటారో చేసుకోండంటూ రెచ్చగొట్టారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత వరకు వెళ్లింది. దీంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కళావెంకటరావు గుర్రాలపాలెంలో జన్మభూమి ఉందంటూ అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఘర్షణ చెలరేగింది. అయితే కొందరు పెద్దలు ఇరువర్గాలవారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.