జేఈఈ మెయిన్స్‌లోనూ అదే హవా
ఉదయ్‌కుమార్‌కు వికలాంగ
కేటగిరీలో రెండో ర్యాంకు
ఓపెన్‌కేటగిరీలో హరిచందన ప్రతిభ
40మందికి వెయ్యిలోపు ర్యాంకులు
విశాఖ ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్స్ ర్యాంకులు ఎట్టకేలకు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో విశాఖ విద్యార్ధులు ప్రతిభ చూపించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల తీరుగానే ఇవి కూడా ఉన్నాయి. పాడేరు మండలానికి చెందిన గిరిజన విద్యార్ధి డప్పొడి ఉదయ్ కుమార్ వికలాంగ కేటగిరిలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు తెచ్చుకుని ప్రతిభ చాటాడు. ఈ విద్యార్థి ఇటీవల అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తమ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. నగరానికి చెందిన హరి చందన ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు తెచ్చుకొని ప్రతిభ కనబరిచింది. ఎల్‌జే విజయ్‌కుమార్ 72వ ర్యాంకు తెచ్చుకున్నాడు.
బి.హేమంత్ సాయి సందీప్ ఓపెన్ కేటగిరిలో 116వ ర్యాంకు తెచ్చుకొన్నాడు. జిల్లా వ్యాప్తంగా సుమారు 11వేల మంది విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరు కాగా సుమారు 2500 మంది ఎన్‌ఐటీలలో ప్రవేశానికి అర్హత సాధించారు. నగరానికి చెందిన 40మంది వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్నారు. వీరిలో టాప్ 500లో సుమారు 15 మంది విద్యార్ధులు ర్యాంకు పొందారు. ఏటా విశాఖ నుంచి ఎంతో మంది విద్యార్ధులు జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పాల్గొంటూ ఉత్తమ ఫలితాలు చాటుకుంటున్నారు. పేరున్న జాతీయ ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకు అర్హత సాధిస్తున్నారు. ఈ ఏడాది కూడా జేఈఈ మెయిన్స్‌లో అదే స్థాయిలో ఫలితాలను పునరావృతం చేశారు.