
‘ఉమ్మడి’ పంపిణీ బాధ్యత గవర్నర్‌దే
- సచివాలయం సహా రాజధానిలోని ఇతర కార్యాలయాల కేటాయింపు
- జనాభా ప్రాతిపదికన ఆఫీస్‌ల విభజన
- సీమాంధ్రకు 58.32 శాతం.. తెలంగాణకు 41.68 శాతం
- రాష్ట్ర రాజధానిలోని సచివాలయంతో సహా అన్ని రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాల భవనాలన్నింటినీ జనాభా ప్రాతిపదికన విభజిం చాల్సి ఉంది. సీమాంధ్రకు 58.32%, తెలం గాణకు 41.68% చొప్పున కేటాయిస్తారు.
- ఏ భవనాలను ఏ రాష్ట్రానికి కేటాయించాలి, ఏ భవనాల్లో ఎటు పక్కన ఎవరికి కేటాయించాలో రాష్ర్ట గవర్నర్ నిర్ణయిస్తారు.
- జీహెచ్‌ఎంసీ పరిధిలో యాజమాన్య నిర్వహణతో పాటు కేటాయింపులు, పంపిణీపై తుది నిర్ణయం గవర్నర్‌దే.
- ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు. శాంతిభద్రతలతో పాటు అంతర్గత భద్రత, ప్రతిష్టాత్మక సంస్థల రక్షణ బాధ్యత గవర్నర్‌దే.
- గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది. సలహాదారులకు కేటాయించిన అంశాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించి మార్గదర్శక సూత్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చే స్తుంది.
- ఇరు రాష్ట్రాల విభజన తరువాత అవసరమైన అదనపు పోలీసు బలగాల పెంపునకు కేంద్రం సహాయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్వహణ, పరిపాలనను మూడేళ్లపాటు కేంద్ర హోంమంత్రిత్వశాఖ చేపడుతుంది.
- సీమాంధ్రలో కొత్తగా గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇరు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ ఆపరేషనల్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి.
- గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని ఏ రాష్ట్ర డీజీపీ కింద పనిచేస్తారో ఇచ్చే ఆప్షన్ ఆధారంగా విభజిస్తారు. ఈ విషయాలన్నింటిలో రాష్ట్ర హోంశాఖ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది.