
సాక్షి, తిరుమల : తిరుమల ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రమని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్ అన్నారు. గురువారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి తిరుప్పావై సేవలో పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ స్వతంతర్‌కుమార్‌కు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించి, శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల జస్టిస్ స్వతంతర్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక భావనతో వస్తున్నారని, అదే వాతావరణం తిరుమలలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని, అందువల్లే ఈ క్షేత్రం పరిశుభ్రత, ప్రశాంత వాతావరణంతో ఉందని కితాబిచ్చారు.