కొత్త డీసీపీగా లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయవాడ సిటీ : కమిషనరేట్ శాంతి భద్రతల విభాగం డీసీపీగా లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం డీసీపీ(పరిపాలన) జీవీజీ అశోక్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. 1994లో గ్రూప్-1 సర్వీసు ద్వారా పోలీసు శాఖలో చేరిన రంగారావు..2011లో ఐపీఎస్ పదోన్నతి పొందారు. పదోన్నతికి ముందు డీఎస్పీగాను, ఓఎస్‌డీగాను బాధ్యతలు నిర్వహించారు. పదోన్నతి తర్వాత వరంగల్ రూరల్ ఎస్పీగా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐపీఎస్‌ల పంపిణీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆయనను కేటాయించారు.
సీపీ ప్రాధాన్యతలే
నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రాధాన్యతలే తన ప్రాధాన్యతలని డీసీపీ విలేకరులకు తెలిపారు. కమిషనర్ ఆలోచనలకు అనుగుణంగా అందరిని కలుపుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు. డీసీపీగా సొంత జిల్లాకు రావడం ఆనందంగా ఉందని రంగారావు తెలిపారు. డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కమిషనరేట్ అధికారులతో సమావేశమై వివిధ అంశాలను సమీక్షించారు.
బాధ్యతల స్వీకారం
Published Sun, Apr 12 2015 4:01 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement