Commissionerate
-
అమ్మకానికి చిన్నారులు బయటపడ్డ సంచలన నిజాలు
-
బొల్లినేని శ్రీనివాస గాంధీపై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కమిషనరేట్‌లో అవినీతి అధికారులను సీబీఐ పట్టుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబధించి జీఎస్టీ అవకతవకలను సరి చేయడానికి తెలంగాణ జీఎస్టీ కమిషనరేట్ ఉద్యోగులు సీహెచ్ సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. బొల్లినేని శ్రీనివాస గాంధీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇన్స్పెక్టర్గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్‌లో పోస్టింగ్ పొందారు. 2003లో డిప్యుటేషన్‌పై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్)కి వెళ్లారు. 2004లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత 2017లో జీఎస్టీకి బదిలీ అయ్యారు. గాంధీ దాదాపు 13ఏళ్ల పాటు ఈడీలో పనిచేశారు. ఈ సమయంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. (ఎల్లో మీడియా దుష్ప్రచారంపై రజత్ భార్గవ్ స్పష్టత) తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పని చేశారు. కేంద్ర మాజీమంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీలాండరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులను గాంధీ ఉద్దేశ్యపూర్వకంగా బుట్ట దాఖలు చేశారు. పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. బాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో అమరావతి ప్రాంతంలో భూమిని కూడా కట్టబెట్టినట్లు సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. -
ఇక్కడ డీఎస్పీలు.. అక్కడ ఇంకా సీఐలే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో డీఎస్పీల పదోన్నతుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.1995 ఎస్సైల బ్యాచ్‌లో చేరిన వరంగల్ రేంజి వారంతా నిబంధనల ప్రకారం..ఇప్పటికి డీఎస్పీలుగా ఉండాలి. కానీ, వారు నేటికీ సీఐలుగానే కొనసాగుతున్నారు. మరోవైపు వారితోపాటే విధుల్లో చేరిన హైదరాబాద్ రేంజ్ పరిధి ఎస్సైలు మాత్రం ప్రస్తుతం డీఎస్పీలయ్యారు. పదోన్నతుల విషయంలో వరంగల్ రేంజ్ ఎస్సైలకు ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఇదే సమస్య ఎదురవుతోంది.ఇక్కడ ఎంతకాలం పనిచేసినా తమ బ్యాచ్మేట్లకు సెల్యూట్లు కొట్టడం అలవాటుగా మారిపోతోందని పలువురు సీఐలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కలిసొచ్చిన కొత్త కమిషనరేట్లు... హైదరాబాద్ రేంజ్లో 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ కమిషనరేట్ ఒక్కటే ఉండేది. తర్వాత సైబరాబాద్, రాచకొండ ఆవిర్భవించాయి. పోలీసుస్టేషన్లు, పోస్టులు పెరిగాయి. ఫలితంగా ఇక్కడ విధులు నిర్వహించే ఎస్సైలకు పదోన్నతుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దక్కాయి. పైగా సీఐ, డీఎస్పీల పదోన్నతుల విషయంలో కానిస్టేబుల్ నుంచి వచ్చిన వారికి 30 శాతం, ఎస్సైగా చేరిన వారికి 70 శాతం వెయిటేజీ ఇస్తారు. హైదరాబాద్ రేంజ్లో ఇలాంటివి ఎక్కడా పాటించలేదు. వరంగల్ రేంజ్లో పోలీస్స్టేషన్ల విస్తరణ అంతగా లేదు. దీంతో కొత్త పోస్టులకు అవకాశం లేకుండాపోయింది. పైగా ఇక్కడ ఉన్నతాధికారులు పదోన్నతుల విషయంలో కానిస్టేబుల్, ఎస్సై వెయిటేజీని పక్కాగా అమలుచేస్తున్నారు. ఫలితంగా పదోన్నతుల విషయంలో వీరికి ప్రతీసారి మొండిచేయే ఎదురవుతోంది. పాతికేళ్లయినా సీఐలుగానే.. 1995 ఎస్సై బ్యాచ్‌ల వారు 2016 నుంచి 2019లో దశలవారీగా పదోన్నతులు పొంది డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 360 మందికిపైగా ఉండగా, హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 310మందికి పైగా సీఐలు డీఎస్పీలు అయ్యారు. కానీ, వరంగల్ రేంజ్లో ఉన్న 54 మందికి మాత్రం నేటికీ పదోన్నతి దక్కలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. 1991 ఎస్సైల బ్యాచ్‌కు చెందిన వారికి వరంగల్ రేంజిలోనూ ఇలాగే జరిగితే సీఎం కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుని అప్పటికప్పుడు 145 సూపర్‌న్యూమర్ పోస్టులు సృష్టించి వారికి డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు. అంతేకాదు, 1996 ఎస్సై బ్యాచ్‌కు చెంది హైదరాబాద్ రేంజ్లో ఉన్న 64 మందికి డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనితో 1995 ఎస్సై బ్యాచ్‌ల బ్యాచ్‌కు చెందిన వరంగల్ రేంజ్ సీఐలంతా సీఎంను కలసి మొరపెట్టుకున్నారు. సీఎం సూచన ల మేరకు డీజీపీ ఆఫీసు వీరికి పదోన్నతులు కల్పించే ఫైల్‌ను తయారు చేసి ఫిబ్రవరిలో సీఎంవోకు పంపింది. కరోనా కారణంగా దానికి గ్రహణం పట్టుకుంది. 25 ఏళ్లలో ఒకే ఒక్క పదోన్న తి పొందిన తాము మానసిక వేదనతో ఉన్నామని పలువురు సీఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకంటే జూనియర్లకు పదోన్నతులు సిద్ధమవుతుంటే.. తమకు మాత్రం రేపు మాపు అంటూ నిలుపుదల చేయడం సరికాదంటున్నారు. సీనియా రిటీలో తమ కంటే ముందున్న హైదరాబాద్ రేంజ్ బ్యాచ్మేట్లు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు పొందినా.. తాము సీఐలుగానే మిగిలిపోతామన్న ఆందోళన వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు. -
‘కమిషనరేట్ అక్కడ నిర్మించొద్దు’
సాక్షి, హైదరాబాద్: కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోం స్థలంలోని పదెకరాలను రాచకొండ కమిషనరేట్‌కు కేటాయించారు. జారీ చేసిన జీవోను రద్దు చేయాలని విక్టోరియా హోం భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని జేఏసీ చైర్మన్ కొదండరాం సదర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వి.ఎం. హోం స్థలాన్ని అనాథ విద్యార్థుల కోసం విద్యా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూములను రాకొండ కమిషనరేట్‌కు కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. కమిషనరేట్‌కు తాము వ్యతిరేకం కాదని ఓటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ప్రభుత్వ భూములు కావాల్సినంత ఉన్నాయన్నారు. అక్కడ నిర్మిస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని తెలిపారు. దీనిపై ప్రభుత్వ జీవోలను రద్దు చేసే వరకు తాము పోరాడుతామని, పోరాడే వారికి మద్దతు ఇస్తామని కోదండదాం తెలిపారు. -
కమిషనరేట్ బలోపేతం
అదనపు బలగాల రాక సూచనప్రాయంగా సర్కారు అంగీకారం సీఎం రాగానే ఫైలుకు కదలిక అధికారుల ఆశాభావం పోలీస్ కష్టాలు తీరినట్టే రాజధాని పోలీస్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు అదనపు బలగాలు సమకూరనున్నాయి. ఇందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని కమిషనరేట్ అధికారులకు వర్తమానం అందింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే అదనపు బలగాల ప్రతిపాదన ఫైలు కదిలే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీనికి ఆమోదం లభించిన పక్షంలో రాజధాని పోలీసింగ్‌ను పకడ్బందీ చేసేందుకు అవకాశం ఉంటుంది. విజయవాడ సిటీ : విజయవాడ రాజధానిగా మారిన తర్వాత పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఉన్న అధికారులు బందోబస్తు సహా అన్ని విధులను నిర్వర్తించాల్సివస్తోంది. ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటున్నారు. రోజుకు అరడజను మందికి పైగా మంత్రుల రాకపోకలు జరుగుతున్నాయి. వీరు పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. పైగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా పోలీసులకు తీరిక లేకుండా చేస్తున్నాయి. వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన సమయాల్లో ముందు, తర్వాత బందోబస్తు విధులు పెద్ద సంఖ్యలో చేపట్టాల్సి వస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం భద్రత కోసం పొరుగు జిల్లాల పోలీసులు ఉన్నప్పటికీ.. నగరంలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యులు, అతి ముఖ్యులు వెళ్లినప్పుడు పోలీసులే విధులు నిర్వహిస్తున్నారు. పైగా రోజువారీ విధులు కూడా ఉండడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. బందోబస్తు తదితర విధులను సమన్వయం చేసుకోవడం సిటీ స్పెషల్ బ్రాంచి అధికారులకు తలకుమించిన భారంగా పరిణమించింది. ముగ్గురే ఐపీఎస్‌లు అదనపు డీజీ హోదాలో నగర పోలీసు కమిషనర్‌తోపాటు ఇద్దరు డీసీపీలు మాత్రమే ఐపీఎస్ అధికారులు. అదనపు ఎస్పీలు ముగ్గురు, 12మంది ఏసీపీలు, 45 మంది ఇన్స్పెక్టర్లు, 120 మంది ఎస్ఐలు ఉండగా, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సహా హోంగార్డులతో కలుపుకొని ఉన్న సిబ్బంది సంఖ్య 3000 మాత్రమే. పెరుగుతున్న జనాభా, పెరిగిన వాహనాలు, రాజధాని సమస్యల నేపథ్యంలో ఇప్పుడున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఏమాత్రం సరిపోరు. ఉన్న సిబ్బందితోనే అధికారులు ప్రయాసపడి విధులు నెట్టుకొస్తున్నారు. మరికొందరు ఐపీఎస్‌లు కావలెను రాజధాని ప్రతిపాదనల్లో భాగంగా కనీసం మరో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు కావాలి. ఇదే సమయంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీల సంఖ్యతో పాటు పోలీసు సిబ్బందిని పెంచాలి. అదనంగా సిటీ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటుచేయాలి. గత కొన్ని నెలలుగా నగర పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయమై పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రతిపాదనల అమలులో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే కమిషనరేట్ అధికారుల ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిసి అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. సిటీ స్పెషల్ బ్రాంచి, క్రైం, ట్రాఫిక్ విభాగాలను పటిష్టం చేయడంతో పాటు వీఐపీలు, వీవీఐపీల భద్రత సులభ సాధ్యమవుతుందనేది కమిషనరేట్ అధికారుల అభిప్రాయం. -
కమీషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్ నంబర్లమార్పు
-
సూపర్ బాస్
పోలీస్ కమిషనరేట్‌లో ఆయనో మధ్యస్థాయి ఉద్యోగి... కానీ అక్కడ ఆయనే ‘సూపర్ పవర్’. ఉన్నతాధికారికి కళ్లూ చెవులూ అంతా ఆయనే. కీలక నిర్ణయాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నారు. ఎంతగా అంటే కమిషనరేట్ పరిధిలోని ఇటీవల బదిలీల్లో ఆయనే చక్రం తిప్పారు. ప్రజాప్రతినిధుల మాట కూడా చెల్లుబాటు కాని సందర్భంగా ఆయన మాత్రం అనుకున్నది చేయగలిగారు. తన వర్గీయులైన ఏడుగురికి కీలక పోస్టింగులు దక్కేలా చేయగలిగారు. - కమిషనరేట్‌లో చక్రం తిప్పుతున్న ఉద్యోగి - ఆయన చెప్పిందే అక్కడ వేదం - తన ‘వర్గీయులకే’ కీలక పోస్టింగులు - విస్తుపోతున్న పోలీసు అధికారులు కమిషనరేట్‌లో ఓ మధ్యస్థాయి ఉద్యోగి సర్వం తానై చక్రం తిప్పుతున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా కాని పనులు కూడా ఆయనే చిటికెలో చేయించేస్తుండటం గమనార్హం. ఎవరి మాట వినరు అని పేరుపడ్డ ఉన్నతాధికారి కూడా ఆయన ఎంత చెబితే అంత అన్నట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఆయనే ‘సరైన ఛానల్’ అనేది నిర్ధారణ అయిపోయింది. దాంతో ఏకంగా ఆయన తనకు సన్నిహితులైన అధికారులతో ఓ ‘వర్గాన్ని’ కూడగట్టారు. అందుకు హైదరాబాద్స్థాయిలోని ఇద్దరు ప్రముఖ రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారుల పేర్లను అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ ప్రాంతానికి చెందిన ఆ ఇద్దరు ఉన్నతాధికారులకు హైదరాబాద్‌స్థాయిలో తిరుగులేని పరపతి ఉంది. తద్వారా తమ ‘వర్గానికి’ నగరంలోని పోలీస్ ఉన్నతాధికారి ఆశీస్సులు లభించేలా చేయగలిగారు. తాజా బదిలీల్లో తన ‘వర్గ’ అధికారులకు కీలక పోస్టింగులు దక్కేలా చక్రం తిప్పారు. తార్కాణాలివిగో... - ఇటీవల రేంజ్ నుంచి వచ్చిన ఓ అధికారిని శివారులోని కేంద్ర పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి బదిలీ చేశారు. ఆయన అక్కడ రెండునెలలు చేశారో లేదో ఆయనకు మరింత ముఖ్యమైన పోలీస్ స్టేషన్‌కు మార్చారు. నగరం మధ్యలోని అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్లో పోస్గింగిచ్చారు. - అంతవరకు ఆ కీలకమైన పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారి కూడా ‘సూపర్ పవర్’వర్గీయుడే. అందుకే ఆయనకు కూడా ఇబ్బంది లేకుండా దక్షిణ నియోజకవర్గ పరిధిలో పోస్టింగు ఇప్పించారు. - సూపర్ పవర్ వర్గీయుడైన ఓ అధికారి తూర్పు నియోకజవర్గంలోని కీలక విభాగంలోనే దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. ఇటీవల పలు ముఖ్యమైన దాడులు, కేసులు ఈ విభాగమే పర్యవేక్షిస్తోంది. అందుకే ఆ అధికారిని బదిలీ చేయకుండా అదే స్థానంలో కొనసాగేలా చక్రం తిప్పారు. - అదేవర్గానికి చెందిన మరో సన్నిహిత అధికారిని దక్షిణ నియోజకవర్గంలోని పారిశ్రామిక వ్యవహారాలను పర్యవేక్షించే కీలక పోస్టింగు ఇచ్చేలా చేశారు. - ‘సూపర్ పవర్’కు సన్నిహితుడైన నాలుగో పట్టణ పరిధిలోని ఓ అధికారిని పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైన స్థానానికి బదిలీ చేశారు. - తమ సన్నిహితుడైన మరో అధికారికి ఏకంగా విజయనగరం జిల్లా నుంచి నగర పరిధికి బదిలీ చేయించారు. ఆయనకు భీమలి నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో పోస్టింగు ఇప్పించారు. ఆ ‘సూపర్ పవర్ ’ సత్తాకు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు అందరూ విస్మయం చెందుతున్నారు. -
మింగేశారు!
వీడ్కోలు విందు సొమ్ము స్వాహా ఆనక వేడుకకు ఇండెంట్లు కమిషనరేట్‌లో చర్చ విజయవాడ సిటీ : చెయ్యి తడిపితే చాలు ఎంతటి పనైనా చిటికెలో చేసేసే నగరంలోని కొందరు పోలీస్ అధికారులు చివరకు విందు భోజనాల ఇండెంట్ సొమ్మునూ వదల్లేదు. బదిలీపై వెళ్లే పోలీ సుల వీడ్కోలు ‘విందు’ కోసం ఉన్నతాధికారులు మంజూరుచేసిన సొమ్మును భోంచేశారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశాల అమలుకు తమ పరిధిలోని కొందరికి ‘ఇండెంట్లు’ వేసి (చోటామోటా నాయకులు, వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేయడం) విందు భోజ నాలు ఏర్పాటుచేసినట్టు తెలిసింది. అదేమంటే అసలు డబ్బులు ఇవ్వలేదని కొందరు.. ఇచ్చిన సొమ్ము చాల్లేదని మరికొందరు ఇండెంట్ల బాట పట్టి విందు భోజనాలు ముగించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా తమ కు ఇష్టులైన (జనరల్ డ్యూటీ) కానిస్టే బుళ్లతో వ్యవహారం నడిపించారు. బాస్ చెప్పిందే తడువు వసూళ్లకు తెగబడటంతో సిబ్బందికి విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. సొంత సిబ్బందికి ఖర్చు పెట్టమంటూ అధికారులు ఇచ్చిన సొమ్మును జేబులో వేసుకున్న అధికారుల వైనంపై పోలీసులు చర్చించుకుంటున్నారు. ఒకరిద్దరు అధికారులు మినహా మెజారిటీ అధికారులు విందు కోసం ఇచ్చిన సొమ్మును స్వాహా చేశారనేది పోలీస్ వర్గాల సమాచారం. ఇదీ జరిగింది గతనెల ఆఖరి వారంలో కమిషనరేట్‌లో పనిచేస్తున్న 18మంది ఎస్ఐలు సహా 280మంది బదిలీ అయ్యారు. వీరిలో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరందరికీ చిరు సత్కరాలు చేసి పంపాలని, వచ్చే వారిని సాదరంగా ఆహ్వానించాలని పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయాలంటూ ఒక్కో పోలీస్‌స్టేషన్‌కి రూ.20వేలు మంజూరు చేశారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల స్టేషన్లలో సుహృద్భావ పరిస్థితులు నెలకొని సిబ్బందిలో ఐక్యత ఉంటుందనేది ఆయన అభిప్రాయం. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, ట్రాఫిక్, క్రైం సహా అన్ని విభాగాలకు ఈ మొత్తాలను అందించారు. మరేం జరిగింది పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన మొత్తాలను కొందరు ఎస్‌హెచ్‌వో (స్టేషన్ అధికారులు) గుట్టుచప్పుడు కాకుండా జేబులో వేసుకున్నారు. బదిలీ జరిగిన వాళ్లు వెళ్లకపోవడం, రావాల్సిన వాళ్లు రాకపోవడం వంటి కారణాలను సాకుగా చూపించి రోజులు నెట్టుకొచ్చారు. ఉన్నతాధికారులు ఆగ్రహించడంతో కొందరు హడావుడి చేసి విందు భోజనాలను ‘మమ..’ అనిపించారు. మరికొం దరు అధికారులు సీపీ బదిలీపై వెళ్లేంత వరకు కాలయాపన చేశారు. ఆ తర్వాత తమకు డబ్బులు ఇవ్వలేదని కొందరు అధికారులు ప్రచారం చేసి స్థానికంగా పోలీసుల అవసరాలు ఉండే చోటామోటా నేతలు, వ్యాపారులకు ఇండెంట్లు వేసి వసూళ్లకు పాల్పడ్డారు. సెంట్రల్ జోన్‌లోని ఓ స్టేషన్ అధికారి డబ్బులు ఇవ్వలేదని ప్రచారం చేశాడు. ఆ కారణం చూపించి తన అనుచరుడి ద్వారా భారీగానే వసూలు చేయించినట్టు చెబుతున్నారు. విష యం చర్చకు దారితీయడంతో తనకు రూ.10వేలు మాత్ర మే ఇచ్చారంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. ఇదే రీతిలో మరికొందరు అధికారులు కూడా ఉన్నారు. ఇంకొందరు మాత్రం కమిషనరేట్ నుంచి వచ్చిన మొత్తాన్ని సిబ్బందికి అందజేసి మరికొంత తామివ్వడం ద్వారా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. -
కార్మికశాఖ విజిలెన్స్‌లో అవినీతి తిష్ట..!
- మూడుస్లారు తప్పించినా అదే స్థానంలో ‘పర్యవేక్షకుడు’ - ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ‘విచారణ’ ఫైళ్లు సాక్షి,సిటీబ్యూరో: కార్మికశాఖ కమిషనరేట్‌లోని విజిలెన్స్ విభాగానికి అవినీతి చెద పట్టింది. కార్మికశాఖ నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలకు సిఫార్సు చేయాల్సిన విజిలెన్స్ విభాగం అవినీతిమయంగా మారింది. దీర్ఘకాలికంగా ఇక్కడ తిష్ట వేసిన ‘పర్యవేక్షకుడు’ పై అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని ఈ విభాగం నుంచి ముచ్చటగా మూడుసార్లు తప్పించినప్పటికీ మళ్లీ అదే స్థానానికి రావడం విస్మయం కలిగిస్తోంది. సాక్షాత్తు సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల అమలు సైతం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కార్మిక శాఖ కమిషనర్‌గా డాక్టర్ అశోక్ ఉన్నప్పుడు విజిలెన్స్ విభాగం పర్యవేక్షకుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో అతడిని అక్కడి నుంచి తప్పించారు. కమిషనర్ డాక్టర్ అశోక్ బదిలీ కావడంతో తిరిగి పాతస్థానం చేజిక్కించుకోవడంలో సదరు పర్యవేక్షకుడు సఫలీకృతమయ్యాడు. మళ్లీ అవినీతి ఆరోపణలు రావడంతో కొత్త కమిషనర్ అతడ్ని అక్కడి నుంచి తప్పించారు. తాజాగా రాజకీయ పైరవీలతో మళ్లీ ఆయన అదే స్థానంలో చేరడం కార్మిక శాఖలో చర్చనీయంశంగా మారింది. తొక్కి పెట్టుడు... కార్మికశాఖ విజిలెన్స్ విభాగానికి విచారణ కోసం ఫైల్‌ను తొక్కి పెట్టడం ఆనవాయితీగా మారింది. ఉదాహరణకు రెండేళ్ల క్రితం ‘ పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్‌గా విధుల్లో చేరి 13 నెలల జీతాన్ని అక్రమంగా తీసుకున్నారు’ అనేఅభియోగాలపై విజిలెన్స్ విభాగానికి (లెటర్ నంబర్ ఏ/5002/2013, తేదీ 7-11-2013) అధికారికంగా ఒక ఫైల్ చేరింది. కానీ ఇప్పటి వరకు ఆ ఫైల్ విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లోనే ఉంది. సదరు అధికారి పదవీ విరమణ కూడా జరిగిపోయింది. అలాగే, రంగారెడ్డి జిల్లా డీసీఎల్ ఒకరు ఆఫీస్ రికార్డును ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడిన అభియోగంపై విజిలెన్స్ విభాగానికి (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012.తేదీ 25-08-2012) మరో ఫైల్ చేరింది. ఏళ్లు గడుస్తున్నా ఆ ఫైల్ కూడా విచారణకు నోచుకోలేదు. అసలు ఫైల్ ఉందా? అదృశ్యమైందా..? తెలియని పరిస్థితి నెలకొంది. సదరు డీసీఎల్ సైతం ఇప్పటికే పదవీ విరమణ చేశారు. ఏసీబీ విచారణ జరిపించండి: రిటైర్డ్ డీసీఎల్ కార్మిక శాఖ విజిలెన్స్ విభాగం అవినీతిపై ఏసీబీ విచారణ జరిపించాలని అదే శాఖకు చెందిన రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఎస్. రాజేందర్ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయంలోని విజిలెన్స్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఆ లేఖలో వివరించారు. -
ఉత్సవ విగ్రహాలుగా ఎస్‌హెచ్‌వోలు
- విచారణకు ప్రత్యేక బృందాలు - విధివిధానాలపై సీపీ వెంకటేశ్వరరావు కసరత్తు - కమిషనరేట్‌లో సుదీర్ఘ చర్చ - విచారణకు ప్రత్యేక టీములు - విధివిధానాలపై సీపీ కసరత్తు విజయవాడ సిటీ : పోలీసు స్టేషన్ స్థాయిలో ఇప్పటివరకు కింగ్‌మేకర్ పాత్ర పోషించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లు(ఇన్స్పెక్టర్లు) రానున్న రోజుల్లో డమ్మీలుగా మారనున్నారు. కేసుల విచారణ బాధ్యతలను ప్రత్యేక టీముల(ఇన్వెస్టిగేషన్ టీమ్స్)కు అప్పగించి ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) నమోదు, బందోబస్తు విధులకు ఎస్‌హెచ్‌వోలను పరిమితం చేయనున్నారు. ఈ విధానంపై విధివిధానాలు రూపొందించేందుకు సోమవారం కమిషనరేట్‌లో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలతో సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు సమావేశమై చర్చించారు. జోనల్ స్థాయిలో ఐదేసి ప్రత్యేక విచారణ(ఇన్వెస్టిగేషన్) బృందాలు ఏర్పాటుకానున్నట్లు తెలిసింది. ఆయా టీములకు కేసుల వారిగానా? స్టేషన్ల వారీగా? బాధ్యతలు అప్పగిస్తారనేది ఇంకా స్పష్టతరాలేదు. మెజారిటీ అధికారులు ఎస్‌హెచ్‌వోల పాత్రను పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో జరిగిన శ్రీలక్ష్మి, ఆయేషామీరా హత్యకేసులు, పెదఅవుటుపల్లి ట్రిపుల్ మర్డర్ కేసుల్లో ఇలాంటి విచారణ బాగుంటుందే తప్ప ప్రతికేసును కూడా ప్రత్యేక విచారణ బృందానికి అప్పగించడాన్ని పలువురు వ్యతిరేకించినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో పోలీసు స్టేషన్లలో తమ పాత్ర ‘ఉత్సవ విగ్రహాల’ మాదిరి తయారవుతుందనే ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నూతన విధానం అమలుచేయాలని సీపీ యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసు స్టేషన్ల స్థాయిలో కేసుల నమోదు, దర్యాప్తు బాధ్యతలను ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయా పోలీసు స్టేషన్లలో సిబ్బందిని సమన్వయం చేసుకొని కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టిసారించి నిందితుల అరెస్టు మొదలు న్యాయస్థానంలో చార్జిషీటు(నేరాభియోగపత్రం) దాఖలు వరకు ఇన్స్పెక్టర్లు బాధ్యత తీసుకుంటున్నారు. కీలక కేసుల్లో పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల పట్టివేత, అరెస్టు వంటి చర్యలు తీసుకుంటున్నారు. లోకల్ అధికారుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కేసుల విచారణ సమయంలో కీలక సమాచారం వస్తోంది. తద్వారా కేసుల దర్యాప్తును వేగం చేసేందుకు దోహదపడుతోంది. రానున్న రోజుల్లో సీపీ ఆలోచనలకు అనుగుణంగా కేసుల దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక బృందాలకు అప్పగిస్తే స్టేషన్ అధికారుల పాత్ర నామమాత్రం కానుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రత్యేక బృందాలకు కేసును బదలాయించాల్సి ఉంటుంది. దర్యాప్తు, నిందితుల అరెస్టు వంటి అన్ని అంశాలను దర్యాప్తు బృందాలు పర్యవేక్షిస్తాయి. ముఖ్యులు వచ్చినప్పుడు బందోబస్తు విధులకు ఎస్‌హెచ్‌వోలు సహా దర్యాప్తు బృందంలో లేనివారిని వినియోగిస్తారు. ఇలా ఉండొచ్చు నూతన విధానంలో ప్రతి జోన్‌కు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఉండొచ్చని కమిషనరేట్ వర్గాల సమాచారం. సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఇద్దరు ఎఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు, కొందరు హోంగార్డులు దర్యాప్తు బృందంలో ఉంటారు. ఐదు దర్యాప్తు బృందాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జోన్లలోని ఇద్దరు ఇన్స్పెక్టర్లకు అప్పగిస్తారు. వీరిని ఏసీపీలు పర్యవేక్షిస్తుంటారు. స్టేషన్లలో కేసులు నమోదైన వెంటనే వీరికి ఎఫ్ఐఆర్లు బదిలీ చేయాల్సి ఉంటుంది. విధివిధానాలు రూపొందిస్తున్నాం విచారణ బాధ్యతలను వేరు చేసే విషయంలో విధివిధానాలు రూపొందిస్తున్నట్లు సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు చెప్పారు. సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని అధికారులతో నూతన విధానంపై చర్చిస్తున్నట్టు తెలిపారు. -
మెరుగైన సేవల కోసమే కమిషనరేట్
మహిళలకు రక్షణ, భద్రత కల్పిస్తాం షీ టీంలు బలోపేతం చేస్తాం రౌడీలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం రూరల్ కార్యాలయం ఏర్పాటుపై చర్చలు రాజకీయ పెత్తనంపై పరిశీలన ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తాం : సుధీర్‌బాబు వరంగల్ క్రైం : వరంగల్ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల రక్షణే లక్ష్యంగా తాను విధులు నిర్వహిస్తానని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. వరంగల్ నగర తొలి పోలీస్ కమిషనర్‌గా జి.సుధీర్‌బాబు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్, సైబరాబా ద్ కమిషనరేట్‌తోపాటు వరంగల్ నగరాన్ని కమిషనరేటుగా ప్రకటిస్తూ ఈ ఏడాది జనవరి నెల 25న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుధీర్‌బాబుకి డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ నగర పోలీసు కమిషనర్‌గా బదిలీ చేసింది. శుక్రవారం ఉదయం పోలీసు కమిషనరేటు కార్యాలయూనికి చేరుకున్న ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన కార్యాలయంలో వరంగల్ అర్బన్ ఇన్చార్జి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబర్ కిషోర్‌ఝా నుంచి వరంగల్ నగర కమిషనర్‌గా సుధీర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ నగర కమిషనరేట్ అడిషనల్ డీసీపీ యాదయ్య, ఓ ఎస్డీ సన్ప్రీత్సింగ్తోపాటు వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐ, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐ, పోలీసు అధికారుల సంఘం, పరిపాలన సిబ్బంది నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తాం.. రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ స్థాయిలో పోలీసులు తమ విధులు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వరంగల్ పట్టణ ప్రజల సహకారం అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని ప్రోత్సహించ డం జరుగుతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం ‘షీ’ టీంలను బలోపేతం చేస్తామన్నారు. ఏసీపీ, డీసీపీలను పెంచుతాం.. దేశవ్యాప్తంగా పోలీసు పరంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపి వరంగల్ కమిషనరేట్‌కు స్వీకరిస్తామని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం కృషి చేయడంతోపాటు విధుల్లో రాణిస్తున్న వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కమిషనరేట్ పరిధిలో డీసీపీ, ఏసీపీలను నియమించడంతోపాటు ఠాణాల సంఖ్యను పెంచి.. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తారని తెలిపారు. వరంగల్ నగర పోలీసు కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు పోలీసు అధికారులు కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలపై విషయాలపై చర్చించారు. రాజకీయ జోక్యంపై పరిశీలన పోలీసుల విషయాల్లో రాజకీయ జోక్యంపై పరి శీలిస్తామని కమిషనర్ అన్నారు. ఇటీవల పోలీ సు విషయాల్లో రాజకీయ జోక్యం అతిగా ఉం దని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా... అతిగా రాజకీయ జోక్యం ఉంటే అలాంటి ఇబ్బంది ఉంటుందన్నారు. రౌడీలపై ఉక్కుపాదం నగర పరిధిలోని రౌడీలపై ఉక్కుపాదం మోపుతామని, కరడు కట్టిన రౌడీలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఆయా స్టేషన్లవారీగా రౌడీలతోపాటు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా ఉంటుందన్నారు. గుడుంబాను అణచివేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. నగర పరిధిలో రూరల్ కార్యాలయంపై పరిశీలన తాను ఇప్పుడే విధుల్లో జాయిన్ అయ్యాయని రూరల్ కార్యాలయం నగర పరిధిలో ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడతాననన్నా రు. రూరల్ కార్యాలయ ఏర్పాటుపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు కమిషనర్‌పై విధంగా స్పందిం చారు. అదేవిధంగా కానిసేబుళ్ల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని, పోలీసు సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు. -
బాధ్యతల స్వీకారం
కొత్త డీసీపీగా లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ సిటీ : కమిషనరేట్ శాంతి భద్రతల విభాగం డీసీపీగా లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం డీసీపీ(పరిపాలన) జీవీజీ అశోక్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. 1994లో గ్రూప్-1 సర్వీసు ద్వారా పోలీసు శాఖలో చేరిన రంగారావు..2011లో ఐపీఎస్ పదోన్నతి పొందారు. పదోన్నతికి ముందు డీఎస్పీగాను, ఓఎస్డీగాను బాధ్యతలు నిర్వహించారు. పదోన్నతి తర్వాత వరంగల్ రూరల్ ఎస్పీగా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐపీఎస్‌ల పంపిణీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆయనను కేటాయించారు. సీపీ ప్రాధాన్యతలే నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రాధాన్యతలే తన ప్రాధాన్యతలని డీసీపీ విలేకరులకు తెలిపారు. కమిషనర్ ఆలోచనలకు అనుగుణంగా అందరిని కలుపుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు. డీసీపీగా సొంత జిల్లాకు రావడం ఆనందంగా ఉందని రంగారావు తెలిపారు. డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కమిషనరేట్ అధికారులతో సమావేశమై వివిధ అంశాలను సమీక్షించారు. -
కమిషనరేట్‌లో కలకలం
చర్చకు దారితీసిన ‘నైట్ డామినేషన్’పై ఎంపీ వ్యాఖ్యలు కేశినేని మాటల వెనుక ఆంతర్యంపై అధికారుల ఆరా? పార్కింగ్ స్థల వివాదంలో పోలీసులు సహకరించలేదని గుర్రు! మంత్రి ఉమాకు సీపీ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆగ్రహం! విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు చేపట్టిన ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’పై ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) చేసిన వ్యాఖ్యలు కమిషనరేట్‌లో కలకలం రేపాయి. గతంలో అధికార పార్టీకి చెందిన ఓ న్యాయవాది ఆపరేషన్ నైట్ డామినేషన్ తనిఖీలపై హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసి స్టే వెకేట్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఎంపీ కూడా ఇదే అంశంపై వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీ యాంశంగా మారింది. ప్రభుత్వ విధానాల్లో భాగంగా పోలీసులు చేపట్టిన చర్యలపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై పోలీసు వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఇతర కారణాలు ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసు కమిషనర్ నగరానికి వచ్చిన తర్వాత చర్చించి కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించాలని పలువురు సీనియర్ అధికారులు భావిస్తున్నారు. ‘నైట్ డామినేషన్’పై స్టే ‘రాజధాని సేఫ్ సిటీ’ కార్యక్రమంలో భాగంగా నేరగాళ్ల ఏరివేత కోసం గత నెల 16వ తేదీన పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించి ఏ విధమైన గుర్తింపు పత్రాలు లేని వారి కంటిపాపలు, వేలి ముద్రలు సేకరించారు. పోలీసుల తనిఖీల్లో పలువురు పాత నేరస్తులు దొరికారు. ఈ సమయంలో నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తానికొండ చిరంజీవి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు నైట్ డామినేషన్ తనిఖీలపై స్టే విధించింది. ఇదే సమయంలో చట్టానికి లోబడి భద్రతాపరమైన చర్యల్లో భాగంగా పోలీసులు చేసే పనులు కొనసాగించాలని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టులో స్టే వెకేట్ చేయించేందుకు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ సాగుతుండగానే ఎంపీ కేశినేని నాని కూడా సీపీ చర్యలను తప్పుబడుతూ వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. ఆంతర్యమేంటి? పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యల వెనుక ఇతర కారణాలు ఉండొచ్చనే అభిప్రాయాన్ని కమిషనరేట్‌లోని పలువురు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు. తన కార్యాలయం పక్కన పార్కింగ్ స్థలం వివాదం సమయంలో పోలీసులు తనకు అనుకూలంగా వ్యవహరించలేదని ఎంపీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. స్థలం ఖాళీ చేయకుంటే రెండు వర్గాల మధ్య మరోసారి ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు ఇచ్చిన నివేదిక కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖాళీ చేయించినట్టు సమాచారం. మరోవైపు తాను చేసే సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్న సీపీ.. మంత్రి దేవినేని ఉమాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా కేశినేని ఆగ్రహానికి మరో కారణమని సమాచారం. -
కమిషనరేట్‌లో... మళ్లీ తుపాకీ మోత
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. కొన్నేళ్ల కిందటి ఘటన పునరావృతం కావడంతో కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని పెదావుటపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం దుండగులు జరిపిన కాల్పుల్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణంగా హతమయ్యారు. ఒకే ఘటనలో ముగ్గురు వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మృతి చెందడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేసింది. వెంటనే నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అనుమానిత ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. ఇటీవల తరచూ నగరంలో తుపాకులు పట్టుబడడం కూడా పోలీసుల ఆందోళనకు కారణంగా చెబుతున్నారు. కొద్ది నెలల కిందట రైల్వే స్టేషన్ సమీపంలో ఆగంతకులు వదిలి వెళ్లిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకోగా..ఇటీవల పెడన గ్రామానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగిని అరెస్టు చేసి రెండు దేశవాళీ తపంచాలు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ఎంపిక చేసిన తర్వాత నెలకొన్న పరిణామాల్లో తుపాకులు భారీగా దిగుమతి జరుగుతున్నట్టు పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ దిశగా పోలీసు అధికారులు దృష్టిసారించారు. గతంలో జరిగిన ఘటనలు ఓ సారి పరిశీలిస్తే... పాతికేళ్ల కిందట సూర్యారావుపేటలో ఇంటిలిజెన్స్ అధికారి ఇమ్మానియేల్ రాజును తీవ్రవాదులు తుపాకీతో కాల్చి చంపారు. పాతబస్తీకి చెందిన సర్జికల్ వ్యాపారి కోటంరాజు లక్ష్మీనారాయణ అలియాస్ పంతులు తుపాకీ కాల్పుల్లో మృతి చెందారు. ఈ కేసులో నిందితులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో హతమైన ఐఎస్ఐ ఉగ్రవాది అజంఘోరి సంఘటనలో పాల్గొన్నట్టు నిందితుని డైరీ ఆధారంగా అప్పట్లో పోలీసులు గుర్తించారు. కేబుల్ వార్‌లో భాగంగా సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి సాయిబాబును విశాఖపట్టణానికి చెందిన దేవినేని శేషగిరిరావు తుపాకీతో కాల్చి చంపారు. నగర తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావుపై కొందరు వ్యక్తులు అతని ఇంట్లోనే తుపాకీ కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. నగరానికి చెందిన వంగవీటి శంతన్‌కుమార్‌పై కోర్టు సమీపంలోనే దుండగులు కాల్పులు జరపగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత తిరిగి మరోసారి తుపాకీ మోత వినిపించడం నగరవాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. -
విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు
నలుగురు అదనపు డీసీపీలు విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్‌కు నలుగురు అదనపు డీఎస్పీలను కేటాయించిన ప్రభుత్వం.. ఇక్కడ పనిచేస్తున్న ఒక అదనపు ఎస్పీ, ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేస్తున్న ఇద్దరు డీఎస్పీలు సహా ముగ్గురు అదనపు డీసీపీలను బదిలీ చేసింది. నగర పోలీసు కమిషనరేట్ బలోపేతం చేసేందుకు ఉన్నతాధికారులు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ బదిలీలు జరిగినట్టు పోలీసు వర్గాల సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వచ్చేది వీరు.. గుంటూరు అర్బన్ వెస్ట్‌జోన్ డీఎస్పీగా పనిచేస్తున్న టీవీ నాగరాజుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి విజయవాడ నగర ట్రాఫిక్ అదనపు డీసీపీగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.నాగేశ్వరరరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి నగర క్రైం విభాగం అదనపు డీసీపీగా నియమించారు. కేంద్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) డీఎస్పీగా పనిచేస్తున్న పి. నరసింహారావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి సిటీ స్పెషల్ బ్రాంచి (సీఎస్బీ) అదనపు డీసీపీగా నియమించారు. కేంద్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) డీఎస్పీగా పనిచేస్తున్న జి.రామకోటేశ్వరరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి నగర పోలీసు కమిషనరేట్‌లోని పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) విభాగం అదనపు డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెళ్లేది వీరు... నగర పోలీసు కమిషనరేట్‌లో అదనపు డీసీపీ(క్రైమ్స్)గా పనిచేస్తున్న వి.గీతాదేవిని విజయవాడ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీ చేశారు. నగర పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న అదనపు డీసీపీ(పరిపాలన) షకీలా భానుకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేస్తున్న టి.రవీంద్రబాబును బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. -
సీమాంధ్ర పోలీస్‌కు బెజవాడే బాస్
*డీఐజీ స్థాయి నుంచి నేరుగా అడిషనల్ డీజీ స్థాయికి * అడిషనల్ డీజీగా సురేంద్రబాబు? * కీలకం కానున్న జంటనగరాల పోలీసింగ్ *కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ పోలీసులు నంబర్‌వన్ కానున్నారు. ఇప్పటివరకు డీఐజీ స్థాయి క్యాడర్‌కే పరిమితమైన విజయవాడ కమిషనరేట్‌ను ఏకంగా అదనపు డీజీ స్థాయికి పెంచనున్నారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర హోం శాఖకు చేరినట్లు సమాచారం. దీంతోపాటు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గుంటూరు అర్బన్ పోలీసు జిల్లాను డీఐజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసి కమిషనరేట్‌గా మార్చనున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో ఏలూరును పశ్చిమగోదావరి జిల్లా నుంచి విభజించి ఏలూరు అర్బన్ జిల్లాగా మార్చే ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదముద్ర పడితే సీమాంధ్ర పోలీసింగ్‌కు బెజవాడ కీలకం అవుతుంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగర కమిషనరేట్‌కు హైదరాబాద్ మెట్రో నగరం స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తుప్రారంభించింది. రాష్ట్ర అవతరణ తేదీ అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎం తాత్కాలిక క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ కమిషనరేట్‌ను నేరుగా అడిషనల్ డీజీ స్థాయికి చేయనున్నారు. ఇక్కడ కమిషనర్‌గా రెండో పోలీస్ బాస్ స్థాయిలో ఉన్న అడిషనల్ డీజీని నియమించనున్నారు. ఈ పోస్టింగ్ కోసం అప్పుడే పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సీపీగా సమర్ధంగా పనిచేసిన నిమ్మగడ్డ సురేంద్రబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనతోపాటు గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం కీలక కేడర్‌లో ఉన్న ఉమేష్ షరాఫ్, ఎ.బి.వెంకటేశ్వరరావుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. రెండేళ్లలో రెట్టింపు కానున్న స్టేషన్లు, సిబ్బంది.. కొత్త రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విజయవాడ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీ, ఇంద్రకీలాద్రి, విజయవాడ రైల్వే జంక్షన్ ఉన్నాయి. వీటికి ఇప్పటికే భద్రత పెంచాల్సిన అవరం ఉందనే ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద ఉన్నాయి. వీటితో రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా ఏర్పాటయ్యే పలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సిబ్బంది, అధికారులు, ఉన్నతాధికారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. వారందరి భద్రతకు రెట్టింపు పోలీసు సిబ్బంది అవసరం ఉంటుంది. కమిషనరేట్‌లో ఇప్పుడున్న రెండున్నర వేలమంది పోలీసులకు అదనంగా మరో రెండున్నర వేలమందిని పెంచనున్నారు. కమిషనరేట్‌లో 11 పోలీస్ స్టేషన్లు, రూరల్‌లో 9 స్టేషన్లు మొత్తం 20 ఉన్నాయి. ఇవిగాక కమిషనరేట్‌లో మరికొన్ని ప్రాంతాలను కూడా కలిపే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. ఇదంతా రానున్న రెండేళ్లలో జరగవచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు పూర్తయితే విజయవాడ కమిషనరేట్ హైదరాబాద్ నగరం స్థాయిలో భద్రత ఉంటుందని చెబుతున్నారు. విభజనతో పోలీసుల శాఖలో అన్ని కేడర్లలో ప్రమోషన్లు ముందుగానే వచ్చే అవకాశాలున్నాయి. మిగిలిన కేడర్ల క ంటే సీఐలకు డీఎస్పీ ప్రమోషన్లు ముందుగా వచ్చే అవకాశాలున్నాయి. కొత్త సిబ్బంది నియామకం కూడా జరుగనున్నట్లు సమాచారం. విజయవాడ అర్బన్ జిల్లా విజయవాడ 1983 మే 18న అర్బన్ జిల్లాగా ఆవిర్భవించింది. అప్పట్లో ఐదు లక్షల జనాభా ఉండడంతో ఎనిమిది లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్లు, ఒక మహిళా పీఎస్, 10 రూరల్ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లు, నాలుగు ట్రాఫిక్ పీఎస్‌లతో అర్బన్ జిల్లా కార్యకలాపాలను సాగించింది. తొలి ఐపీఎస్ అధికారిగా కె.ఎస్.వ్యాస్ పనిచేశారు. ఇప్పటికే కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. తాజా పరిణామాలతో విజయవాడ, గుంటూరు పట్టణాలు జంటనగరాలుగా అభివృద్ధి చెందనున్న దృష్ట్యా నేరుగా అడిషనల్ డీజీ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేయనున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా గుంటూరు అర్బన్ జిల్లా 2010 సంవత్సరం జూన్‌లో ఏర్పాటైంది. అనంతరం నగర పరిసర ప్రాంతాలు విస్తరించడంతో జనాభా భారీగా పెరిగింది. వాస్తవానికి 2016లో అప్‌గ్రేడ్ కావాల్సిన గుంటూరు అర్బన్ జిల్లా రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందే అప్‌గ్రేడ్ కానుంది. డీఐజీ స్థాయి అధికారి కమిషనర్‌గా, ఐపీఎస్ అధికారులు ఇద్దరిని ఇక్కడ డీసీపీలుగా నియమించే అవకాశం ఉంది. -
ప్రజలకు మరింత చేరువవుతాం...
సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కమిషనర్‌గా ఏడాది పూర్తి సాక్షి, సిటీబ్యూరో: మెరుగైన సేవలందించేందుకు తాము ప్రజలకు మరింత చేరువవుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 4వ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి ఈనెల 27కు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆనంద్ గురువారం గతేడాది తాము సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ ప్రణాళికను మీడియాకు వివరించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన అభయ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకుని, పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి దోషులకు శిక్షపడేలా చేయడంలో సఫలమయ్యామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఐటీ కారిడార్ పోలిసింగ్‌ను డీజీపీ ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించామని, ఇందు కోసం ప్రత్యేకంగా ఐదు పెట్రోలింగ్ వాహనాలను, 40 మంది సిబ్బందిని, వీరిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ఇన్స్పెక్టర్ను నియమించామన్నారు. ఇక ఐటీ ఉద్యోగినిల భద్రత కోసం రవాణా వ్యవస్థను మెరుగపర్చడంతో పాటు ప్రతి క్యాబ్‌కు పోలీసు రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పని సరి చేశామన్నారు. దీనికి తోడు మహిళా ఇన్స్పెక్టర్ నేతత్వంలో మహిళా హెల్స్‌లైన్‌ను ఏర్పాటు చేసి.. ఐటీ ఉద్యోగినుల్లో ఆత్మస్థైర్యం పెంచామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయన్నారు. సైబరాబాద్‌లో సుమారు 250 ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో గతంలో 80 కంపెనీలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉండగా... ఈ ఏడాది 150 కంపెనీలను చేర్చామన్నారు. భవిష్యత్తులో అన్ని కంపెనీలను ఇం దులో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేశామన్నారు. ఇక ఈనెలలో సిక్‌చావ్నీలో జరిగిన మతఘర్షణలు వేరే ప్రాంతాలకు విస్తరించకుండా తమ సిబ్బం ది, అధికారులు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి... నగర ట్రాఫిక్ చీఫ్‌గా తనకు ఉన్న గతానుభవంతో సైబరాబాద్‌లో సైతం ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతితో కలిసి ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు ఫలించాయన్నారు. రద్దీ జంక్షన్లను మోడ్రన్ జంక్షన్లుగా చేసి పాదచారులు సులువుగా రోడ్డు దాటే అవకాశం కల్పించామన్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్డుపై 24 గంటలూ పోలీసు గస్తీని ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల భరతం పట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ను ఉధృతం చేయడంతో పాటు దేశంలోనే మొదటిసారిగా ‘ఔటర్’పై లేన ్లవారీ వేగ నియంత్రణ అమలు చేయడంతో ప్రమాదాలు తగ్గాయన్నారు. సిక్చావ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం... సిక్‌చావ్నీలో ఎన్నో ఏళ్లుగా రగులుతున్న మత విద్వేషాలకు చెక్ పెట్టేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. ఇరు మత పెద్దలతో ఇప్పటికే సమావేశమై ఈ విషయంపై చర్చించామన్నారు. ఒక వర్గానికి చెందిన జెండా విషయంలో తరచు గొడవలు జరగడం మంచిది కాదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయపార్టీల నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరువర్గాల మతపెద్దలతో త్వరలో భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఆనంద్ వెల్లడించారు. -
కమిషనరేట్‌ను విభజిస్తే చాలు!
జిల్లా స్థాయిలో యథావిధిగా వ్యవ సాయాధికారులు సాక్షి, హైదరాబాద్: కార్యాలయం, ఉద్యోగస్తుల విభజనపై వ్యవసాయశాఖ కసరత్తు చివరి దశకు వచ్చింది. ప్రభుత్వం నుంచి విధి విధానాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సవూచారాన్ని సిద్ధం చేశారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వారినే విభజించనున్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న వారిని అలాగే కొనసాగించనున్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న వారిలో వేరే ప్రాంతానికి చెందిన వారు లేకపోవడంతో ఈ నిర్ణయూనికి వచ్చారు. ఇక, ఈ శాఖలో 534 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. -
ఫైనల్స్‌కు సర్వం సిద్ధం
సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆనంద్ సైబరాబాద్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫైనల్స్‌కు సర్వం సిద్ధంగా ఉన్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం కమిషనరేట్‌లో ఉన్న 7 వేల సిబ్బందితో బందోబస్తుకు ప్రణాళికను రూపొందించామన్నారు. తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అదనంగా 11 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ఫోర్సెస్, 15 రాష్ట్ర ఆర్మ్డ్ఫోర్సెస్తో పాటు 3 వేల మంది ఇతర జిల్లాల సివిల్ కానిస్టేబుల్స్, హోమ్గార్డ్స్ సైబరాబాద్ పరిధిలో ఈనెల 26 నుంచి విధులు నిర్వహిస్తారన్నారు. సైబరాబాద్ పరిధిలో 1437 భవనాల్లో 4137 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయని, ఈ ప్రాంతాల్లో కచ్చితంగా ఎన్నికల నిబంధనలను అమలు చేస్తామని కమిషనర్ ఆనంద్ వెల్లడించారు. 635 పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించామని, ఈ ప్రాంతాల్లో సాయుధ సిబ్బందితో ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణలో ఎవర్నీ ఉపేక్షించబోమని, అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు తప్పనివసరిగా ఎన్నికల నియమ నిబంధనలను పాటించాల్సిందేనని కమిషనర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల రోజువారీ కార్యక్రమాలపై ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్‌తో పాటు డీసీపీ, ఏసీపీలతో నిరంతరం నిఘా పెట్టి బందోబస్తును పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రచార సమయంలోను, పోలింగ్ రోజున ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే కఠినంగా వ్యవహరిస్తామని ఆనంద్ హెచ్చరించారు. అభ్యర్థులపై 120 కేసులు... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎన్నికల కోడ్‌ను అతిక్రమించిన అన్ని పార్టీల అభ్యర్థులపై 120 కేసులు నమోదైనట్టు కమిషనర్ తెలిపారు. ఈ కేసుల్లో అరెస్టులు కూడా జరిగాయన్నారు. భారీగా సామగ్రి స్వాధీనం... ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధం చేసుకున్న సామగ్రిని ఎస్ఎస్టీ టీమ్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ టీమ్‌లు స్వాధీనం చేసుకున్నాయని కమిషనర్ తెలిపారు. వీటిలో 35 క్రికెట్ కిట్స్, 275 వాలీబాల్ నెట్స్, 457 చీరలు, 1175 ప్యాంట్లు, షర్ట్లు, 4 ద్విచక్రవాహనాలు, 9 త్రీ వీలర్స్, 27 ఫోర్ వీలర్స్ ఉన్నాయన్నారు. మద్యం నిల్వల కోసం గాలింపు.... ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం నిల్వలు, సరఫరాకు సంబంధించి ఇప్పటి వరకూ 196 కేసులు నమోదు చేశామన్నారు. రూ. 10.75 లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చే శామని కమిషనర్ తెలిపారు. కొందరు అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని మద్యం నిల్వ చేస్తున్నారని సమాచారం అందిందని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. -
భారీగా పెరగనున్న ఖాళీలు
ఈ ఏడాది చివరినాటికి 1200 మంది పదవీ విరమణ అధ్వానంగా మారనున్న నగర పోలీసు కమిషనరేట్ పరిస్థితి సాక్షి, సిటీబ్యూరో: అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న నగర పోలీసు కమిషనరేట్ పరిస్థితి మరింత అధ్వానంగా మారనుంది. కమిషనరేట్‌లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1200 మంది సిబ్బంది వచ్చే 8 నెలల్లో పదవీ విరమణ పొందనుండటమే దీనికి కారణం. కమిషనరేట్ ఏర్పడ్డాక భారీ స్థాయిలో ఇంతమంది రిటైర్ కాబోతుండటం ఇదే తొలిసారి. 1947 నాటి నగర జనాభా లెక్కల ప్రకారం కమిషనరేట్‌కు 12401 పోస్టులు మంజూరు చేశారు. అందులో 8697 పోస్టులను మాత్రమే భర్తీ చే యగా ఇంకా 3704 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయితే, సివిల్, ట్రాఫిక్, ఆర్మూడ్ రిజర్వు తదితర విభాగలలో ఈ ఏడాది చివరి నాటికి 1200 మంది పదవీ విరమణ పొందుతుండడంతో ఆయా విభాగాల్లో ఖాళీల సంఖ్య 4904కి పెరుగుతోంది. తాజా జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఈ ఖాళీల సంఖ్య సుమారు 10 వేలకు చేరుతోంది. త్వరలో హెచ్‌సీలకు పోస్టింగ్‌లు... కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది, శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన వారిలో కొందరు ఇప్పటికీ కానిస్టేబుల్‌గానే విధులు నిర్వహిస్తున్నారు. హెడ్‌కానిస్టేబుల్ పోస్టింగ్‌లు ఖాళీ లేకపోవడంతో పదోన్నతి పొందినా పాత పోస్టింగ్‌లోనే పని చేయాల్సి వస్తోంది. అయితే ఈ ఏడాది భారీ సంఖ్యలో హెడ్‌కానిస్టేబుళ్లు పదవీ విరమణ పొందుతుండటంతో వీరికి త్వరలోనే పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశాలున్నాయి. గతేడాది హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన 294 మందిలో 107 మందికి మాత్రమే పోస్టింగ్‌లు ఇచ్చారు. మిగిలిన 187 మందికి ఇవ్వలేదు. వీరందరికీ నాలుగైదు నెలల్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక పదవీ విరమణ పొందుతున్న వారిలో ఏఎస్ఐల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో సీనియారిటీ ఉన్న హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతులు రాబోతున్నాయి. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి. -
సమన్యాయముంటే సమస్యేలేదు
=‘ఐదేళ్ల నిబంధన’ ఇది లేని కారణంగానే =ఏళ్లుగా అనేక మంది విధులు లూప్లైన్లలోనే =అండ ఉన్న వారికే ఫోకల్ పోస్టింగ్ అవకాశం =పరిస్థితి సమీక్షించాలని కోరుతున్న సిబ్బంది సాక్షి, సిటీబ్యూరో: ‘పలుకుబడి ఉన్న వాడికే పోస్టింగ్... ‘ఖద్దరు’ అనుగ్రహిస్తేనే బాధ్యతలు తీసుకోగలిగేది’... ఇదీ ప్రస్తుతం పోలీసు విభాగంలో జనమెరిగిన సత్యం. ఫలితంగా పోస్టింగ్స్‌లో సమన్యాయం లేక అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత డీజీపీ హయాంలో తెరపైకి వచ్చిన ‘ఐదేళ్ల నిబంధన’ కూడా ఇలాంటి పరిస్థితుల వల్లే ఏర్పడిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దకుంటే సిబ్బందిలో నైతికస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రేటు కట్టి మరీ వసూలు... జంట కమిషనరేట్ల పరిధిలో బదిలీలు చేపట్టిన ప్రతిసారీ ఉన్నతాధికారులకు తలనొప్పులే. ప్రతి సందర్భం లోనూ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పోస్టింగ్ ఇవ్వడమనేది అసాధ్యంగా మారిపోయింది. ‘ఖద్దరు’ జోక్యంతో జంట కమిషరేట్ల పరిధిలో పోలీసుస్టేషన్లలో ఇన్స్పెక్టర్ పోస్టుకు ‘రేటు’ కట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. ఈ ధోరణి కారణంగా అనునిత్యం పైరవీలు చేసుకునే సామర్థ్యం ఉన్న వారు ఫోకల్ పోస్టిం గ్స్‌గా పిలిచే కీలక ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలుగా ఏళ్ల పాటు పని చేయగలుగుతున్నారు. ఈ ఖద్దరును కాదని ఎవరైనా ఉన్నతాధికారి పోస్టింగ్ ఇచ్చినా... సదరు అధికారి అక్కడ చేరడం అసాధ్యమనే చెప్పాలి. గతంలో కొన్ని పోస్టింగ్స్ మారిపోవడమే దీనికి తార్కాణం. సమర్థత, సీనియారిటీ జాన్తానై... బదిలీ విషయంలో ఈ విధానం ఏ స్థాయికి పెరిగిం దంటే... ఖద్దరుకు ఖరీదు చెల్లించలేకపోయినా... పై స్థాయి వరకు పైరవీ చేసే పలుకుబడి లేకపోయినా ఆ అధికారులు ఏళ్ల తరబడి లూప్ లైన్స్‌గా పిలిచే ప్రాధాన్యం లేని పోస్టులో కొనసాగాల్సి వస్తోంది. సదరు అధికారి ఎంతటి సమర్థుడైనా, గతంలో ఎలాంటి కీలక విభాగాలు, సున్నితమైన కేసుల్ని పర్యవేక్షించినా ఈ పైరవీల జోరులో పక్కకు వెళ్లిపోతాయి. కేవలం సిఫా ర్సు లేఖల ఆధారంగా జరుగుతున్న ఈ వ్యవహారంలోనూ పోటీ పెరిగిపోవడంతో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. దీనికి విరుగుడుగానే గతంలో ఐదేళ్ల పాటు కమిషనరేట్‌లో పని చేస్తే బయటకు వెళ్లాలనే నిబంధన విధించారు. ప్రతిభకు పూర్తిగా పాతర పడటం, రాజ కీయ నాయకులు, ఉన్నతాధికారుల పైరవీల జాతర జరుగుతుండటంతోనే ఈ విధానం అమలులోకి తేవాల్సి వచ్చిందన్నది సిబ్బంది మాట. సిటీలోనూ లూప్లైన్లు... ఐదేళ్ల పాటు కమిషనరేట్‌లో పని చేసిన అధికారుల్ని ఎంపిక చేసే విధానంలోనూ లోపాలున్నాయన్నది అధికారుల మాట. కమిషనరేట్‌లో ఉన్న లూప్‌లైన్లలో పని చేసిన వారిని, ఫోకల్ పోస్టుల్లో విధులు నిర్వర్తించిన వారినీ ఒకే గాటిన కట్టి బయటకు పంపడం తీవ్ర అన్యాయమని వాపోతున్నారు. ఇక్కడి లూప్‌లైన్లలో పని చేస్తున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క సుప్రీం కోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానాలు సైతం ఎస్హెచ్ఓ ఆ పైస్థాయి అధికారులు వివాదాస్పదమైతే మినహా రెండేళ్ల పాటు పోస్టులో కొనసాగాలని చెప్తుండగా... కొన్ని పరిస్థితుల్లో తీసుకున్న ‘ఏడాది పాటే’ అనే నిబంధన అన్యాయమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక విభాగాల్లో చేరిన వ్యక్తి దానిపై పట్టు సాధించడానికే ఆరు నెలలకు పైగా పడుతుందని, అలాంటిది ఏడాదికే బదిలీ అంటే అన్యాయమంటున్నారు. ఇలా చేస్తే ఉత్తమం... ఈ పోటీ ఎక్కువగా ఇన్స్పెక్టర్ స్థాయిలోనే ఉం టోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించి, కొన్ని కీలక చర్యల్ని తీసుకుంటే పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వ్యక్తి కనిష్టంగా ఎనిమిదేళ్లు ఆ హోదాలో పని చేస్తారు. ఈ కాలంలో ఒక్కో పోస్టింగ్ రెండేళ్లంటూ లెక్కకట్టినా... రెండు ఫోకల్, రెండు లూప్లైన్లు చేసేలా నిబంధన విధిం చాలి. దీనివల్ల అందరికీ అవకాశం రావడంతో పాటు పైరవీల జోరు తగ్గుతుంది. -
దోపిడీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: అద్దెకు ఇల్లు కావాలని వెళ్లి ఇల్లు చూపిస్తున్న మహిళ మెడలోని పుస్తెల తాడు తెంచేయడమేకాక ఆమెపై హత్యాయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులను పెందుర్తి క్రైం పోలీసులు బుధవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త ఏసీపీ సి.ఎం.నాయుడు తెలిపిన వివరాలివి. పెందుర్తి బ్రాహ్మణ వీధిలో ఆళ్ల సత్యనారాయణకు ఓ ఇల్లుంది. ఈ ఇంటిని ఎవరైనా అద్దెకు అడిగితే ఇవ్వాలంటూ తాళాలను ఆయన వీధిలో ఉన్న పీలా జయలక్ష్మికి అప్పగించారు. ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన కింజరాపు రాములు (33), బాలి చంద్రశేఖర్ అలి యాస్ శేఖర్ (20)లు అద్దెకు ఇల్లుందా అంటూ జయలక్ష్మిని సంప్రదించారు. ఆమె అదే వీధిలో ఉంటున్న దొడ్డి సత్యవతికి తాళాలు ఇచ్చి వచ్చిన వారికి ఇల్లు చూపించాలని కోరింది. దీంతో సత్యవతి రాములు, శేఖర్‌ను రెండో అంతస్తులో ఉన్న ఇల్లు చూపించేందుకు తీసుకువెళ్లింది. గది తలుపుతీసి సత్యవతి ఇంటిలోకి వెళ్లగా రాముల్ని బయట నిలబడమని చెప్పి చంద్రశేఖర్ గదిలోకి వెళ్లాడు. సత్యవతి వెనుకగా వెళ్లి ఆమె నోట్లో గు డ్డలు కుక్కి మెడలో ఉన్న నాలుగు తులా ల పుస్తెలతాడును తెంచేశాడు. ఈ హఠాత్పరిణామంతో అవాక్కయిన సత్యవతి గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్ద రూ ఆమెను పీకనులిమి చంపే ప్రయత్నం చేశారు. చాలాసేపైనా సత్యవతి రాకపోవడంతో అనుమానం వచ్చిన జయలక్ష్మి మేడపైకి వెళ్లగా అక్కడ సత్యవతిపై హత్యాయత్నం జరుగుతుండడాన్ని చూసి గట్టిగా అరిచింది. దీంతో నిందితులిద్దరూ సత్యవతిని వదిలేసి 16 అడుగుల మేడపై నుంచి దూకి పారిపోయారు. బాధితురాలి కుమారుడు దొడ్డినరసింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం సీఐ ఎస్.అడమ్, ఎస్ఐ ప్రసాద్‌లు ఘ టనా స్థలికి చేరుకుని విచారణ జరిపారు. స్థానికులు తెలిపిన ఆధారాల మేరకు నిందితులపై నిఘా పెట్టారు. బుధవారం నిందితులు విశాఖ నగరానికి వెళ్లేందుకు పెందుర్తి రైల్వేస్టేషన్లో వేచి ఉండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం... నిందితుల్లో రాము ఆర్టీసీలో డ్రైవర్. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. డబ్బుల కోసం ఒత్తిడి పెరగడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చంద్రశేఖర్ బీకాం చదువుతున్నాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరూ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.