జిల్లా స్థాయిలో యథావిధిగా వ్యవ సాయాధికారులు
సాక్షి, హైదరాబాద్: కార్యాలయం, ఉద్యోగస్తుల విభజనపై వ్యవసాయశాఖ కసరత్తు చివరి దశకు వచ్చింది. ప్రభుత్వం నుంచి విధి విధానాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సవూచారాన్ని సిద్ధం చేశారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వారినే విభజించనున్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న వారిని అలాగే కొనసాగించనున్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న వారిలో వేరే ప్రాంతానికి చెందిన వారు లేకపోవడంతో ఈ నిర్ణయూనికి వచ్చారు. ఇక, ఈ శాఖలో 534 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు.