పి. గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం పట్టణంలో గురువారం ఉదయం కాపు నేతలు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మూడు రోడ్ల కూడలిలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా నేతలు కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. కాపు నాయకుడు ముద్రగడ చేస్తున్న దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పి.గన్నవరంలో కాపు నేతల ర్యాలీ, ధర్నా
Published Thu, Jun 16 2016 12:47 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
Advertisement
Advertisement