ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: గల్లీలో ఉద్యమించే దమ్ములేక దీక్ష పేరుతో చంద్రబాబు ఢిల్లీకి పరారయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బంగారు బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఖమ్మం నయాబజార్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణకు అనుకూలమని మా ట్లాడిన సీమాంధ్ర పార్టీ నేతలు తెలంగాణ నోట్‌కు ముందు రూట్ మార్చారని విమర్శిం చారు. కిరణ్‌బాబు, చంద్రబాబు...ఎంతమంది బాబులు వచ్చినా తెలంగాణను ఆపలేరన్నారు.
కొత్త సంవత్సరం వచ్చేలోగా తెలంగాణ వచ్చి తీరుతుందన్నారు. వెయ్యి మంది బిడ్డల ఆత్మార్పణ ఫలితమే తెలంగాణ వచ్చిందని, కొత్త రాష్ట్రాన్ని అడ్డుకునేవారికి తెలంగాణ తల్లుల కడుపుకోత అర్థం కావడం లేదన్నారు. మగవారు పా ర్టీలు మార్చినా ఆడబిడ్డలు మాత్రం ఒకసారి కమి ట్ అయితే ఆ లక్ష్యం పూర్తయ్యేవరకు విశ్రమించరని, అభిప్రాయాలు మార్చుకోరని తెలిపా రు. తెలంగాణ దేవుడు భద్రాద్రి రాముడంటూ సభికులచే నినాదాలిప్పించారు. తనను పట్టించుకోకపో తే ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవ’ంటూ ఆ దేవుడినే నిలదీసిన కంచెర్ల గోప న్న తెలంగాణ బిడ్డేనని..ధ్యేయానికి అడ్డొస్తే దేవుడినైనా తెలంగాణ బిడ్డలు నిలదీస్తారని కవిత అన్నారు.
మహిళలతో హోరెత్తిన ‘నయాబజార్’ మైదానం
ఈ వేడుకల సందర్భంగా నయాబజార్ మైదా నం మహిళలతో నిండిపోయింది. పోలీసు లు ముందుజాగ్రత్తగా పురుషులు, యువకులను కళాశాల మైదానంలోకి అనుమతించలేదు. పెద్ద సం ఖ్యలో వచ్చిన యువకులతో ఆ ప్రాంతంలోని ర హదారులన్నీ కిక్కిరిశాయి. పలువురు యువకులు కళాశాల ప్రహరీ, చెట్లు ఎక్కి బతుకమ్మ వేడుకలను వీక్షించారు. గుర్తింపుకార్డులులేని పాత్రికేయులనుసైతంమైదానంలోకి అనుమతించలేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మలను పేర్చిన వారిందరి దగ్గరకు వెళ్ళివారితో బ తుకమ్మ ఆడిపాడి ఉత్సాహపరిచారు. రెండు గం టలపాటు బతుకమ్మ ఆటల్లో ఆమె పాల్గొన్నారు.
బహుమతి ప్రదానం
15 అడుగుల భారీ బతుకమ్మతో వచ్చిన ఖమ్మం లోని బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ గోనా శ్రీలతకు ప్రథమ బహుమతి(రూ.5,000) లభించింది. రెండో బహుమతి(రూ.3,000)ని మణుగూరుకు చెందిన కారంగుల మల్లీశ్వరి, మూడో బహుమతి(రూ.2,000)ని ఖానాపురానికి చెందిన నడిపెల్లి భారతి, నాల్గో బహుమతి (రూ.1000)ని ఖమ్మానికి చెందిన పాలవరపు ఛాయాదేవి-అపర్ణ సాధించారు. విజేతలకు తెలంగాణ జాగృతి నేతలు బహుమతులందించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు బతుకమ్మలను తీసుకు వచ్చారు. బతుకమ్మ ఆట పాటలు, కోలాటం, నృత్యాలతో ఉల్లాసంగా గడిపిన మహిళలు అనంత రం ఊరేగింపుగా వెళ్ళి మున్నేరులో నిమజ్జనం చే శారు. కార్యక్రమంలో బంగారు బతుకమ్మ కన్వీనర్ ఈ శ్వరప్రగడ హరిబాబు. తెలంగాణ జాగృతి, టిఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ, మహిళా నేతలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
దీక్ష పేరుతో ఢిల్లీకి బాబు పరార్
Published Mon, Oct 7 2013 4:16 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM
Advertisement