
'ఆర్నెల్లకోసారి పవన్ నిద్ర లేస్తారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీపై పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన జనసేన అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ పై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని నిప్పులు చెరిగారు. తాము పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ అంశంపై పోరాడుతున్నామని.. దీనిలో భాగంగానే 35 సార్లు చర్చల్లో పాల్గొన్నామని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎంపీల తీరును తప్పుబట్టే హక్కు పవన్ కు లేదని ఈ సందర్భంగా నాని తెలిపారు. ఆర్నెలకోసారి నిద్ర లేచే పవన్.. తమను కించపరచడం తగదని హెచ్చరించారు.
- పార్లమెంటులో మేం గోడలు చూడటం లేదు మైడియర్ పవన్
- ప్రత్యేక ప్యాకేజీపై 35 సార్లు చర్చల్లో పాల్గొన్నాను
- ఆర్నెలకు ఒకసారి జూలు విదుల్చుతారు.. ఆ తర్వాత నిద్రావస్థలోకి వెళ్లి మళ్లీ లేస్తారు
- నేను ప్రశ్నిస్తా అంటారు. ఆ హక్కు మీకుంది
- ఆ హక్కు మాకు కూడా ఉంది
- సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం చచ్చిలేము
- మీరెంతో గొప్పవాళ్లనుకున్నాను.. ఇలా మాట్లాడతారని అనుకోలేదు
- సీమాంధ్రుల సంక్షేమం మీకు ముఖ్యమని భావించాం
- తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే సీమాంధ్ర ఎంపీల్లాగా పడాలని మాట్లాడటం తగదు
- తాము తప్పకుండా సమాధానం చెబుతాం
- ఫోన్ ట్యాపింగ్ జరిగితే హైదరాబాద్ లో సెక్షన్-8 వద్దు అంటున్నారు
- మా ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెడితే సహించేది లేదు
- సీమాంధ్రులకు భద్రతా సమస్య ఉందని మీకు అనిపించడం లేదా?
- హైదరాబాద్ లో సీమాంధ్రుల ఇళ్లను కూల్చితే మీరేం చేస్తున్నారు
- కేసీఆర్ ను వెనకేసుకుని రావడం భావ్యమా?
- కేసీఆర్ కు పవన్ వత్తాసు పలుకుతున్నారు
- కేసీఆర్ జాతీయవాది అని పవన్ చెప్పడం తగదు
- యాదాద్రి గుడి మాస్టర్ ప్లాన్ కు సీమాంధ్ర సినిమా ఆర్ట్ డైరెక్టర్ తీసుకెళ్లి పెడితే.. సీమాంధ్రులకు గౌరవం ఇచ్చినట్లా?
- ఒకసారి మీరు-మీ అన్నయ్య ప్రజలతో పంచులు ఊడగొట్టుకున్నారు
- మీలా ప్రజల్ని మోసం చేయడానికి రాలేదు
- సుజనా చౌదరిని ఉద్దేశించి మాట్లాడే స్థాయి మీది కాదు
- సాధారణ ఎన్నికల్లో మీ మద్దతు లభించినందుకు సంతోషం
- మీ మద్దతు లేకుండానే అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం