బీజేపీ ప్రచార సారథి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సభ విజయవంతం కావడంతో ఓర్చుకోలేని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని ఆర్ అండ్‌బీ అతిథిగృహంలో యెండల వి లేకరులతో మాట్లాడారు.
ఇతర పార్టీల గురించి మాట్లాడే ముందు తమ పాలన వ్యవస్థ ఎలా ఉందో చూసుకోవాలన్నారు. ‘మీరు..మేము..పుట్టకముందే గుజరాత్ అభివృద్ధి చెందిందని మోడీని ఉద్దేశించి పీసీసీ బొత్స మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 1961లో గుజరాత్ ఏర్పడిందని, గుజరాత్‌కు వెళ్ళి అభివృద్ధి ఎవరు చేశారని అడిగితే తెలుస్తుందన్నారు. ఈ విషయంపై దమ్ముంటే సోనియా, రాహుల్ చర్చలకు రావాలని సవాల్ విసిరారు. నరేంద్రమోడీ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్ మాట్లాడటం సమంజసం కాదన్నారు. సమగ్రమైన పోలీసు వ్యవస్థ ఉన్న రాజధానిలో తీవ్రవాదులను వెలికితీయటంలో సీఎం విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు...
భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు వి.హనుమంత్‌రావుకు గాని, కాంగ్రెస్‌పార్టీకి కాని లేదని యెండల అన్నారు. మోడీ సభ వేదిక పై ఉన్నవారి గురించి వీహెచ్ ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్న సంగతి దేశ ప్రజలందరికి తెలిసిందేనన్నారు. గుజరాత్ రాష్ట్ర అభివృద్ధితో ఏ రాష్ట్రాన్ని పోల్చలేమన్నారు. నష్టాల్లో ఉన్న గుజరాత్ విద్యుత్ బోర్డును మోడీ రూ.600 కోట్ల లాభాలకు తీసుకువచ్చాడన్నారు. కాని ఇక్కడ మాత్రం సర్‌చార్జీల పేరిట సీఎం కిరణ్ ప్రజలను బాదుతున్నాడని ఆయన మండిపడ్డారు. రూ. ఏడు వేల కోట్లతో నిర్వహించాల్సిన కామన్‌వెల్త్ గేమ్స్‌ను, రూ. 70 వేల కోట్లతో నిర్వహించి ప్రజాధనాన్ని లూటీ చేశారని అన్నారు.
కిరణ్, బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదం..
Published Wed, Aug 14 2013 6:27 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement