రాయచోటి /లక్కిరెడ్డిపల్లె న్యూస్‌లైన్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి మాజీ మంత్రి ఆర్. రాజగోపాల్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం లక్కిరెడ్డిపల్లెలో నిర్వహించిన ఆర్‌ఆర్ దశదినకర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కలికిరి నుంచి ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టర్‌లో బయలుదేరి లక్కిరెడ్డిపల్లెకు 12.50 గంటలకు చేరుకున్నారు.
తొలుత ఆయన మాజీ మంత్రి ఆర్.రాజగోపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులు భార్య హేమలతమ్మ, కుమారులు మాజీ శాసన సభ్యుడు ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఎండి శ్రీనివాసులురెడ్డి, కుమార్తె రాధమ్మ, మనవళ్లు, మనరాళ్లను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సుమారు 40 నిముషాల పాటు ఆర్‌ఆర్ కుటుంబీకులతో గడిపిన అనంతరం ఆయన తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి అహ్మదుల్లా, మాజీ మంత్రులు జె.సి.దివాకరరెడ్డి, ఎస్.రామమునిరెడ్డి,బ్రహ్మయ్య, 20 సూత్రాల ఆర్థిక అమలు కమిటీ సభ్యుడు తులసిరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, నారాయణరెడ్డి, శివరామక్రిష్ణారావు, కందుల శివానందరెడ్డి, డిసిసి అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, వైఎస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంటు ఇన్‌చార్జ్ మిథున్ రెడ్డి,ఎమ్మెల్సీలు సతీష్‌కుమార్‌రెడ్డి, బత్యాల చెంగల్‌రాయుడు, మాజీ ఎమ్మెల్సీ వెంకట శివారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, పీసీసీ సభ్యుడు రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్‌నేత మేడా మల్లిఖార్జున రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాలాడి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు జిఎండి రఫీ, నర్సారెడ్డి, ఉమాపతిరెడ్డి, మాజీ జెడ్పీటిసిలు రెడ్డెయ్యయాదవ్, నాగసుబ్బారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, ఆర్‌ఆర్ అభిమానులు, అనుచరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆర్‌ఆర్‌కు సీఎం నివాళి
Published Mon, Sep 30 2013 2:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement