ఉద్యోగులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కదారి పట్టించారని అనంతపురం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్నాథరెడ్డి అన్నారు.
ఉద్యోగులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కదారి పట్టించారని, అందువల్లే రెండు నెలలుగా ఉధృతంగా సమ్మె చేస్తున్న వాళ్లు ఉన్నట్టుండి సమ్మె విరమించుకున్నారని అనంతపురం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్నాథరెడ్డి అన్నారు.
సమైక్య వాద ముసుగులో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెరవెనుక మాత్రం రాష్ట్ర విభజనకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తున్నారని, ఆయన అచ్చంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కోవర్టు అని గుర్నాథరెడ్డి మండిపడ్డారు. ఈనెల 26వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభ తర్వాత ఢిల్లీ పెద్దలు దిగిరావాల్సిందేనని ఆయన అన్నారు.