ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు కాపు ద్రోహి అని ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న కాపులను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పి.... చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. కాపుల ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని తెలిపారు.