అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామ్యం అని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో గుర్నాథ్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని అణచివేసేందుకు నీచరాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై గుర్నాథ్రెడ్డి నిప్పులు చెరిగారు.