'సీఎంకు ఆ అధికారం ఉంది,..రెచ్చగొట్టొద్దు' | Kirankumar reddy has right to change portfolios, says anam ramnarayana reddy | Sakshi
Sakshi News home page

'సీఎంకు ఆ అధికారం ఉంది,..రెచ్చగొట్టొద్దు'

Published Wed, Jan 1 2014 12:44 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'సీఎంకు ఆ అధికారం ఉంది,..రెచ్చగొట్టొద్దు' - Sakshi

'సీఎంకు ఆ అధికారం ఉంది,..రెచ్చగొట్టొద్దు'

హైదరాబాద్ : మంత్రి శ్రీధర్బాబు శాఖ మార్పుపై కేబినెట్లో రగడ కొనసాగుతోంది. సీమాంధ్ర ప్రాంత మంత్రులు సీఎం చర్యను సమర్థిస్తుంటే... తెలంగాణ ప్రాంత మంత్రులు మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాగా  శాఖలను మార్పు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. శ్రీధర్బాబు శాఖ మార్పుపై జానారెడ్డి బహిరంగంగా కాకుండా సీఎంతో చర్చించి ఉంటే బాగుండేదని ఆనం అభిప్రాయపడ్డారు. గవర్నర్ నరసింహన్కు తెలంగాణ మంత్రులు ఫిర్యాదు చేయటంపై తానేమీ స్పందించనని అన్నారు.

కాగా తెలంగాణ ప్రాంత మంత్రులు బుధవారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. శ్రీధర్ బాబు శాఖ మార్పుపై వారు గవర్నర్తో చర్చించారు. అనంతరం మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ బాబు శాఖ మార్పును తాము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ఏర్పాటు అవుతున్న తరుణంలో ఇటువంటి చర్య తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందన్నారు. సీమాంధ్ర నేతల వ్యూహాలను తిప్పికొడతామన్నారు. తెలంగాణ ప్రజలు సమన్వయం పాటించాలని జానారెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement