'దమ్ముంటే మొదటి రోజే బిల్లు పెట్టండి'
హైదరాబాద్: కాంగ్రెస్కు దమ్ముంటే పార్లమెంట్ సమావేశాల మొదటి రోజునే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీని, తమ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ను అభాసుపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లుకు తమ పార్టీ పెట్టిన షరతులకు కాంగ్రెస్ అంగీకరించినా, అంగీకరించకపోయినా బిల్లుకు మద్దతు ఇస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ వైఖరి మార్చుకోవచ్చని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు.