
సాక్షి, విజయనగరం: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపాల్ కల్నల్ అరుణ్ కుమార్ విడుదల చేశారు. ఆరో తరగతిలో ప్రవేశానికి 180 మంది ఉత్తీర్ణత సాధించగా, తొమ్మిదో తరగతికి 60 మంది అర్హత సాధించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మార్చి మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. కాగా 2019-20 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో చేరేందుకు సుమారు 60 సీట్లు, 9వ తరగతిలో ప్రవేశానికి 20 సీట్లకు దరఖాస్తు ఆహ్వానించారు. అనంతరం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 5న రాతపరీక్ష నిర్వహించారు. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 10,043 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. పరీక్షా ఫలితాలు, మరిన్ని వివరాల కోసం సైనిక పాఠశాల వెబ్‌సైట్ www.sainikschoolkorukonda.org ని సందర్శించండి.
Comments
Please login to add a commentAdd a comment