
సాక్షి, కాకినాడ: అమరావతిని శాశ్వత రాజధానిగా చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రస్తుతం చంద్రబాబు చాల నిరాశ, వేదనలో ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు అవలంభిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్నంత బాధ చంద్రబాబు గతంలో ఎప్పుడూ పడలేదని ఎద్దేవా చేశారు.
కేవలం అమరావతిలో వారి అనుయాముల ఆస్థులు చేజారిపోతాయని చంద్రబాబు ఆవేదన చెందుతున్నారని మంత్రి విమర్శించారు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ పడుతున్నప్పుడు చంద్రబాబు అండ్ కోకు ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. అదేవిధంగా అమరావతి కాకుండా మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కావడానికి వీలు లేదని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. నోట్ల రద్దు సమయంలో వేసిన కమిటీకి ఆయనే ఛైర్మన్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ.. అప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఎలా పని చేసిందో ఆయనకు తెలియదా అని మంత్రి కురసాల కన్నాబాబు అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment