సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో 2742 కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమలు అమలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు శనివారం (జూమ్) ద్వారా మంత్రి కన్నబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇతర వ్యవసాయ పద్ధతుల కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక ఉత్పత్తులు, తక్కువ పెట్టుబడి, ఒత్తిడి లేని వ్యవసాయం చేయొచ్చని రైతులతో తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్,13 జిల్లాల వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, ప్రకృతి వ్యవసాయ రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
(అచ్చెన్నబీసీ అయితే నేరం వదిలేయాలా: స్పీకర్)
ఒత్తిడి లేని వ్యవసాయం మన నినాదం అవ్వాలని మంత్రి కన్నబాబు రైతులకు సూచించారు. రసాయనాలను పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేయాలని రైతులకు స్పష్టం చేశారు. పెట్టుబడి తగ్గించి, ఉత్పత్తుల నాణ్యతను పెంచడం తమ ప్రధాన లక్ష్యాలుగా వుండాలని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను విడుదల శారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అధికారి శ్రద్ధగా పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి వ్యవసాయంలో మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ఎక్కువ ధర వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వ్యవసాయ మంత్రి సూచించారు. (పది కోట్ల మందికి కరోనా ముప్పు! )
2020-21 సంవత్సరానికి ఆర్‌కేవీవై, పీకేవీవై, కేఎఫ్‌డబ్ల్యూ సహకారంతో 3730 గ్రామపంచాయితీలకు 7 లక్షల మంది రైతులతో పాటు స్వయం సహాయక సంఘాల ద్వారా 3.50 లక్షల మంది నిరుపేద రైతులను ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం జరుగుతున్న గ్రామాల పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. కొత్త రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చూడాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు తగిన సాంకేతిక, శిక్షణా సహకారం ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరంలో 50,000 మంది రైతులకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిని అమలు చేసే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందనీ మంత్రి తెలిపారు.
చదవండి :‘రైతుల గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు’
Comments
Please login to add a commentAdd a comment