సంక్షోభంలో ఉన్న తన ల్యాంకో సంస్థను కాపాడుకోవడానికే కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. సోనియా గాంధీకి పాదాభివందనం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, గౌతంరెడ్డి విమర్శించారు. ల్యాంకోకు ఉన్న 40 వేల కోట్ల అప్పుల్లో 9 వేల కోట్ల మాఫీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అందువల్లే లగడపాటి చిత్తశుద్ధిలేని రాజీనామా చేసి పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఆయనకున్న కంపెనీలపై కేసులున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేస్తామని ఇప్పటికీ నోరు మెదపడం లేదని ఉదయభాను, గౌతం రెడ్డి విమర్శించారు.
'ల్యాంకో కోసమే లగడపాటి.. సోనియాకు పాదాభివందనం'
Published Sat, Oct 19 2013 7:36 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement