ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను సమీకరణ విధానంలోనే చేపట్టాలని మంత్రివర్గం భావించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను సమీకరణ విధానంలోనే చేపట్టాలని మంత్రివర్గం భావించింది. సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ భూ సమీకరణపై సుదీర్ఘంగా చర్చించింది. కొత్త రాజధాని తరహాలోనే మిగతా ప్రాజెక్టులన్నింటికీ కూడా సమీకరణ పద్ధతినే అనుసరించాలని తీర్మానించింది.
విశ్వసనీయం సమాచారం మేరకు.. ఇకపై జరిగే అన్ని కేబినెట్ సమావేశాలూ రాత్రి వరకు కొనసాగుతాయని, అందుకు సిద్ధపడి రావాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. భూ సమీకరణపై చర్చ సందర్భంగా భోగాపురంలో రైతుల వ్యతిరేకత ప్రస్తావనకు రాగా మంత్రులు మణాలిని, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటాలతో పాటు యనమల రామకష్ణుడు బాధ్యత తీసుకుని పూర్తయ్యేలా చూడాలని సీఎం చెప్పినట్టు తెలిసింది.