government projects
-
23 నిమిషాల్లో ముంబై టు పుణె
ముంబై: ముంబై–పుణె మధ్య నిర్మించనున్న హైపర్‌లూప్‌ను ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. భూమిపై నిర్మించే ఓ గొట్టంలో అత్యంత వేగంతో ప్రయాణించేందుకు ఈ హైపర్‌లూప్ ను నిర్మించాలని ప్రణాళిక ఉంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి పుణెలోకి వాకాడ్ వరకు నిర్మించే ఈ హైపర్‌లూప్ అందుబాటులోకి వస్తే, ముంబై–పుణె మధ్య 117.5 కి.మీ. దూరాన్ని కేవలం 23 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రూ.70 వేల కోట్ల వ్యయంతో, రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పుణె మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతోంది. తొలి దశలో పుణె మహానగర పరిధిలోనే 11.8 కిలోమీటర్లపాటు హైపర్‌లూప్‌ను రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మించి, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే రెండో దశలో మిగతా దూరం మొత్తం హైపర్‌లూప్‌ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు సత్వరంగా లభించడం కోసం దీనిని ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రభుత్వం తాజాగా గుర్తించింది. -
అన్ని ప్రాజెక్టులకూ భూ సమీకరణే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను సమీకరణ విధానంలోనే చేపట్టాలని మంత్రివర్గం భావించింది. సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ భూ సమీకరణపై సుదీర్ఘంగా చర్చించింది. కొత్త రాజధాని తరహాలోనే మిగతా ప్రాజెక్టులన్నింటికీ కూడా సమీకరణ పద్ధతినే అనుసరించాలని తీర్మానించింది. విశ్వసనీయం సమాచారం మేరకు.. ఇకపై జరిగే అన్ని కేబినెట్ సమావేశాలూ రాత్రి వరకు కొనసాగుతాయని, అందుకు సిద్ధపడి రావాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. భూ సమీకరణపై చర్చ సందర్భంగా భోగాపురంలో రైతుల వ్యతిరేకత ప్రస్తావనకు రాగా మంత్రులు మణాలిని, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటాలతో పాటు యనమల రామకష్ణుడు బాధ్యత తీసుకుని పూర్తయ్యేలా చూడాలని సీఎం చెప్పినట్టు తెలిసింది. -
అసెంబ్లీలో సీఎంవి అన్నీ అబద్ధాలే
చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్, న్యూస్‌లైన్ : అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినన్ని రోజులు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడిండు.. తెలంగాణ ప్రజల దురదృష్టాన్ని అదృష్టంగా చూపే ప్రయత్నం చేసిండు.. తెలంగాణ ఏర్పాటైతే, మీకు కరెంటే ఉండదన్నడు.. ఇప్పుడు కలిసే ఉన్నాం కదా.. మరి రైతాంగానికి 7గంటల కరెంటు ఎక్కడ ఇస్తుండ్రు.. అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నిం చారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ధూంధాం కార్యక్రమంలో ప్రసంగించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడినపుడు తెలంగాణ ఏర్పాటైతే కరెంటే ఉండదన్నడు, ఇప్పుడు సమైక్య రాష్ట్రం లోనే ఉన్నాం కదా, వ్యవసాయానికి 7గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి 5గంటలకు మించి విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. దీంతో ఇప్పుడే వరినాట్లు, దుక్కులు పారక రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తెలంగాణ ప్రజల దురదృష్టాన్ని అదృష్టంగా చూపే ప్రయత్నం చేశాడన్నారు. 1956కు ముందు తెలంగాణలో 5శాతం మాత్రమే వ్యవసాయ బావులు, బోర్లు ఉండేవని, సమైక్య రాష్ట్రంలో నేడు 55శాతానికి చేరాయని, ఉచితంగా విద్యుత్‌ను ఇస్తున్నామని చెప్పారన్నారు. సీమాంధ్రలో ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టి, కాలువలు తవ్వి, ఎకరానికి రూ.200 తీసుకొని, రెండు పంటలకు నీరిస్తుందన్నారు. తెలంగాణలోనేమో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి బోరు బావులు తవ్వి, కరెంటు సాంక్షన్లు తెచ్చుకొని, మోటార్లు ఏర్పాటు చేసుకుంటే, ఎకరానికి రూ.2లక్షల ఖర్చు వస్తుందన్నారు. ఇదే తెలంగాణ రైతుల అదృష్టం అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలది 60ఏళ్ల న్యాయమైన పోరాటం కాబట్టే, నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుందన్నారు.