రియల్ ఎస్టేట్ హవా కొన్ని ప్రాంతాల్లో సాగుతుండగా బ్రోకర్‌ల పుణ్యమా అని రూ లక్షకు విలువ చేయని భూమి ఇప్పుడు రూ 10 లక్షలకు మించుతోంది.
మోర్తాడ్, న్యూస్‌లైన్ : దూరపు కొండలు నునుపు అన్న చందంలా త యారైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ హవా కొన్ని ప్రాంతాల్లో సాగుతుండగా బ్రోకర్‌ల పుణ్యమా అని రూ లక్షకు విలువ చేయని భూమి ఇప్పు డు రూ 10 లక్షలకు మించుతోంది. హైదరాబాద్, కామారెడ్డిల మధ్య ఉన్న వ్యవసాయ భూములకు ఎకరానికి రూ 30 లక్షల చెల్లించి కొనుగోలు చేసిన వ్యాపారులు... రి యల్ ఢమాల్ కావడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి, స్టేట్ హైవేల పక్క న ఉన్న వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాల కోసం విక్రయించవచ్చని చదును చేయించిన రియల్ బ్రోకర్ లు గజం భూమి ధరను ఆమాంతం పెంచేశారు. మో ర్తాడ్‌లో రోడ్డుకు పక్కన ఉన్న భూమి ధర రూ 40 లక్షలు పలుకుతోంది.
ఇక్కడ గజానికి రూ 15 వేల నుంచి రూ 20 వేల ధరను నిర్ణయించారు. కమ్మర్‌పల్లిలో తాజాగా ఎక రం భూమి ధర రూ 65 లక్షలు పలికింది. గజానికి రూ 20 వేలకు మించి ధర లభిస్తుందనే ఆశతోనే వ్యాపారి ఒక రు రూ 65 లక్షలకు ఎకరాన్ని కొనుగోలు చేశారు. ఆర్మూ ర్, పెర్కిట్, మామిడిపల్లిలలో ఎకరం భూమి ధర రూ 1.50 కోట్లకు చేరింది. ఇక్కడ గజం ధర రూ 18 వేల నుంచి రూ 25 వేల వరకు పలుకుతోంది. భూముల ధరల నియంత్రణ ఎవరి చేతిలో లేకపోవడంతో ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇళ్ల స్థలాల విషయంలోనే కాకుండా బ్రోకర్‌లు వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు మధ్యవర్తిత్వం వ హిస్తున్నారు. దీంతో వ్యవసాయ భూముల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.
పంటల సాగు కు ఆమోదయోగ్యమైన భూమి విలువ సాధారణంగా రూ 4 లక్షల నుంచి రూ 8 లక్షలు పలుకుతుంది. అయితే రి యల్ బ్రోకర్‌ల మాయమాటలతో ధరలు ఎకరాకు రూ 10 లక్షలు మించిపోయింది. ఏడాదిలో రెండు పంట లను పండిస్తే ఎకరం భూమిపై రూ 50 వేలకు మించి లాభం పొందలేరు. అయినా వ్యవసాయ భూములకు రూ లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మార్కెట్‌లో భూములకు భారీగానే ధరలు చెల్లిస్తున్నా... రిజిస్ట్రేషన్ విలువను మాత్రం తక్కువ చూపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సాధారణ ప్రజలు సొం త ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకుంటే.. ధరలు ఆకాశాన్ని అంటడంతో సొంతింటి కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి భూముల ధరల నియంత్రణకు ఏదో ఒక మా ర్గం చూపాలని పలువురు కోరుతున్నారు.