చివరి భూముల్లో సిరులు పండేనా? | Last lands Sirulu season? | Sakshi
Sakshi News home page

చివరి భూముల్లో సిరులు పండేనా?

Published Mon, Oct 21 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

Last lands Sirulu season?

అలంపూర్, న్యూస్‌లైన్: సిరులుపండించే ఆర్డీఎస్ చివరి ఆయకట్టు భూములు నీళ్లులేక దుఃఖిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలు గా కాల్వల ఆధునికీకరణ పనులకు మో క్షం కలగడం లేదు. నీళ్లు రాక..సాగుకు నోచుకోక రైతులు నల్లరేగడి భూములను బీళ్లుగా వదిలేస్తున్నారు. నిజాం నవాబుకాలం నాటి ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్ష న్ స్కీం) జిల్లాలోనే మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. అ లంపూర్ నియోజకవర్గంతోపాటు, కర్ణాటక ప్రాంతంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ని ర్మాణం చేపట్టారు. 17.1 టీఎంసీల నీటివాటాతో సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ నీటివాటాల్లో కోత, హెడ్‌వర్క్స్, కా ల్వల ఆధునీకరణ వంటి సమస్యలతో మూడు టీఎంసీలకు మించి నీరందని దు స్థితి నెలకొంది.  
 
 నీటివాటాల్లో కోతలు
 ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలోని 87,500వేల ఎకరాలకు సాగునీ రు అందించాలి. సుమారు 40 ఏళ్లుగా చివరి ఆయకట్టు పొలాలకు చుక్కనీరు చేరడం లేదు. ప్రస్తుతం 30వేల ఎకరాలకు కూడా సక్రమంగా పారడం లేదు. కర్ణాటకలోని తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్ కెనాల్ 142.8 కి.మీ మేర విస్తరించి ఉంది. కర్ణాటకలో 1-12 డిస్ట్రిబ్యూటరీలతో 42.6 కి.మీ మేర విస్తరించి ఉంది.
 
 కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన 42.7 కి.మీ నుంచి 142.8 కి.మీ వైశాల్యం అలంపూర్ నియోజకవర్గంలోనే ఉంది. ఈ ప్రాంతంలో 12 ఏ నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. కర్ణాటక ఆయకట్టు 5,879 ఎకరాలు కాగా, అలంపూర్ నాలుగు మండలాల ఆయకట్టు 87,500 వేల ఎకరాలుగా నిర్ణయించారు. రాజోళిబండ నుంచి మొత్తం నీటివాటా 17.1 టీ ఎంసీలు.. అందులో కర్ణాటకకు 1.2 టీఎంసీ కాగా, మనరాష్ట్రానికి 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మూడు టీఎంసీలకు మించి నీరందకపోవడంతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు కరువైంది.
 
 చివరి ఆయకట్టు వెలవెల
 ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలోని 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించాలి. అయితే ఆర్డీఎస్ వద్ద 850 క్యూసెక్కుల నీటిమట్టం, అలంపూర్ సరిహద్దు సింధనూర్ వద్ద 771 క్యూసెక్కుల నీటిమట్టం ఉంటేనే చివరి ఆయకట్టు డి-40కి సాగునీరు అందే అవకాశం ఉంటుంది.
 
 1992లో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్ద నెలకొన్న వివాదాల కారణంగా చివరి భూములకు చుక్కనీరు అందించలేకపోతున్నారు. అలంపూర్ మండలంలోని 14 గ్రామాల్లో సబ్‌డిస్ట్రిబ్యూటరీ కింద ఆరుగ్రామాల్లో 2926 ఎకరాలు, ఎస్‌డీ-1ఏలో 551 ఎకరాలు, ఎస్‌డీ-2 కింద 3762 ఎకరాలు, ఎస్‌డీ-3లో 828 ఎకరాలు, ఎస్‌డీ-4లో 828 ఎకరాలు, ఎస్‌డీ-5లో 672 ఎకరాలు, ఎస్‌డీ-6లో 320 ఎకరాలు, ఎస్‌డీ-7లో 538 ఎకరాలు, ఎస్‌డీ-8లో 530 ఎకరాలు, ఎస్‌డీ-8ఏలో 528 ఎకరాలు, ఎస్‌డీ-9లో 320 ఎకరాలు, ఎస్‌డీ-10లో 1461 ఎకరాలు, ఎస్‌డీ-11లో 391 ఎకరాలు, ఎస్‌డీ-12లో 390 ఎకరాలు, టైల్‌అండ్ సబ్ డిస్ట్రిబ్యూషన్ కింద 809 ఎకరాలకు సాగునీరందించాలి. అయితే నాలుగు దశాబ్దాలుగా ఈ చివరి ఆయకట్టుకు నీరందడం లేదు.
 
 శిథిలావస్థలో కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు
 చివరి ఆయకట్టు వరకు నీరు పారకపోవడంతో కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. కానీ వాటి నిర్వాహణను పట్టించుకోకపోవడంతో కాల్వల్లో ముళ్లపొదలు పెరిగాయి. ఆర్డీఎస్ నీళ్లపై ఆశలు వదులుకున్న కొంతమంది రైతులు చేసేదిలేక పొలాల్లో ఉన్న పిల్లకాల్వలను చదునుచేశారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. ఆర్డీఎస్‌ను ఆధునీకరించడంలో చొరవ చూపలేకపోతున్నారు. నాలుగు దశాబ్దాలుగా సాగునీటి కోసం ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచిరోజులు వస్తాయని, ఆర్డీఎస్ ఆధునికీకరణ జరిగి సిరులు పండించవచ్చని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement