విజయవాడ: గన్నవరం విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూములు సేకరించేందుకు బుధవారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా ముగిసింది. భూములు కోల్పోతున్న పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రాణాలైనా అర్పిస్తాం గానీ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కేసరపల్లి, అజ్జంపూడి, బుద్ధవరం మూడు గ్రామాల్లోనూ ఒకే రకంగా పరిహారం ఇవ్వాలని రైతులు, రైతు నేతలు డిమాండ్ చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ బాబు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ప్యాకేజీని ప్రకటించారు. దీనిపై రైతుల నిరసనల నేపథ్యంలో కలెక్టర్ సమావేశాన్ని ముగించారు.
ప్రాణాలైనా ఇస్తాం.. భూములివ్వం
Published Thu, Apr 23 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement