జగన్‌కు ఘనస్వాగతం
విమానాశ్రయం(గన్నవరం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ పార్కు నిర్వాసితులను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్ విమానంలో ఉదయం 9 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ పలకరిస్తూ, అభివాదం చేస్తూ ప్రత్యేక వాహనంలో తణుకు వెళ్లారు.
ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, పార్టీ కృష్ణాజిలా ్లఅధ్యక్షుడు, మాజీ మంత్రి కె. పార్ధసారథి, రాష్ట్ర నాయకులు, ఆళ్ల నాని, తెల్లం బాలరాజు, సామినేని ఉదయభాను, కారుమూరి నాగేశ్వరరావు, పైలా సోమి నాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మీ, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్. నాగిరెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌బాబు, బొప్పన భవకుమార్, ఉప్పాల రామ్‌ప్రసాద్, షేక్ ఆసిఫ్, యువజన విభాగం నాయకులు కాజ రాజ్‌కుమార్, ఉప్పాల రాము, అశోక్‌యాదవ్, తంగిరాల రామిరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మాధు శివరామకృష్ణ, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ. గౌసాని, జిల్లా, నగర నాయకులు కోటగిరి వరప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్, కొణిజేటి రమేష్, జానారెడ్డి, దేవభక్తుని సుబ్బారావు, యనమదల మురళీకృష్ణ, నక్కా గాంధీ, శీలం రంగారావు, యార్కరెడ్డి నాగిరెడ్డి, నిడమర్తి నాగేశ్వరరావు, కోడేబోయిన బాబీ, మద్దినేని వెంకటేశ్వరరావు, బడుగు ఝాన్సీరాణి, ఆవుతు శ్రీనివాసరెడ్డి, దేవగిరి ఓంకార్‌రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, వేల్పూరి బసవరావు, నానిరెడ్డి, నిడమర్తి రామారావు, వినోద్ తదితరులు ఉన్నారు.
––––