అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కార్యకర్తలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ను కలసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు సీఎం కార్యాలయం సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. అందుకువారు సమ్మతించకపోవడంతో పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలు మధ్య తీవ్ర తోపులాట చేసుకుంది.
దాంతో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలపై లాఠీ చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇటీవలే అంగన్వాడీ కార్యకర్తలు నగరంలోని ఇందిరా పార్క్వద్ద నిరవధిక నిరాహరదీక్ష చేపట్టారు. ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.