బాల్యవివాహాల నిరోధానికి చట్టం
పాలకోడేరు రూరల్ : బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయి. ఇప్పటికీ ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య దశలోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో త్వరపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని స్వచ్ఛంద సంస్థలు, అధికారులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఈనేపథ్యంలో బాల్యవివాహాల నిరోధక చట్టం ఏం చెబుతోంది.. ఆ పెళ్లిళ్ల వల్ల సమస్యలేమిటీ వంటి విషయాలు ఐసీడీఎస్ విస్సాకోడేరు ప్రాజెక్టు అధికారిణి వాణీవిజయురత్నం వివరించారు.
చట్టం ఏమి చెబుతుందంటే..
బాల్య వివాహాల నిరోధక చట్టం(1929) స్థానంలో ప్రభుత్వం 2006లో కొత్త బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే నేరం. వాటిని ప్రోత్సహించినా నేరమే. వీటికి కఠిన శిక్షలు ఉంటాయి.
అనర్థాలివీ..
చిన్న వయుస్సులో పెళ్లి చేయుడం వల్ల ఆడపిల్లలకు ఆరోగ్యపర ఇబ్బందులు వస్తారుు.
చదువు, ఆటపాటలతో ఎదగాల్సిన పిల్లలు బలహీనమవుతారు.
శారీరక, వూనసిక పరిపక్వత లేని సవుయుంలో గర్భిణులైతే వూతాశిశువురణాలు సంభవించే ప్రమాదం ఉంది.
చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల కుటుంబ భారం మీద పడుతుంది. అవగాహన లేమి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని తట్టుకునే మానసిక పరిపక్వత లేకపోవడంతో కుటుంబం ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది.
చిన్నవయసులో భర్త, పిల్లలు, అత్తమామల సంరక్షణ భారం పడడంతో ఆడపిల్లలు ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది.
బాల్య వివాహాల వల్ల పుట్టే పిల్లల్లో జన్యులోపం ఉంటున్నట్టు వైద్యులూ హెచ్చరిస్తున్నారు.
నివారణకు మనమేం చేయాలి
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి.
ఎక్కడైనా చిన్నపిల్లలకు పెళ్లి జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే గ్రామస్థాయిలో అంగన్‌వాడీ టీచర్‌కు సమాచారం ఇవ్వాలి.
అంగన్‌వాడీ కార్యకర్త ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌కు గానీ, మహిళా సంక్షేమ అధికారికిగానీ సమాచారం ఇస్తారు.
ఐసీడీఎస్ అధికారులు తహసిల్దార్, ఎస్‌ఐకి సమాచారం ఇచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకుంటారు. బాలలకు రక్షణ కల్పిస్తారు.
ప్రత్యేక కమిటీలు ఉన్నాయి
బాల్య వివాహాలు నిరోధించడానికి ప్రభుత్వం పలు స్థారుుల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
జిల్లాస్థాయిలో కలెక్టర్ బాల్యవివాహాల నిరోధక అధికారిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో మహిళాశిశు సంక్షేమ పీడీతోపాటు ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.
రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, లేదా సబ్‌కలెక్టర్ బాల్య వివాహాల నిరోధక అధికారిగా ఉంటారు. ఆయునతోపాటు డివిజన్‌ల్‌స్థాయి ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.
అంగన్‌వాడి ప్రాజెక్టు పరిధిలో ఐసీడీఎస్ సీడీపీఓ బాల్యవివాహ నిరోధక అధికారిగా ఉంటారు. ఈ స్థాయిలో తహసిల్దార్, ఎస్‌ఐ సభ్యులుగా ఉంటారు.
గ్రావుస్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీలో గ్రావు సర్పంచ్ కమిటీ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. అంగన్‌వాడీ టీచర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, పంచాయతీ బోర్డు మహిళా సభ్యురాలు, ఏఎన్‌ఎం, గ్రామ సమాఖ్య సభ్యులు తదితర 12 మంది కమిటీ సభ్యులుగా ఉంటారు.
బాల్య వివాహాలు జరుగుతున్నట్టు మన దృష్టికి వస్తే ఈ కమిటీల్లో ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు.