అనంతపురం: అనంతపురం జిల్లాలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా బుధవారం ఉదయం కంభదూరు మండలం కుర్లపల్లిలో ఆవుల మందపై చిరుత దాడి చేసింది. ఆ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. అదే విధంగా రాత్రి పూట పొలాల్లో చిరుత సంచరిస్తోంది. దాంతో రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనేచర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.