మచిలీపట్నం : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు మచిలీపట్నం డివిజన్ కార్యాలయ సీనియర్ డివిజనల్ మేనేజరు జె.రంగారావు తెలిపారు. ఎల్‌ఐసీ వార్షికోత్సవాలు సోమవారం ఎల్‌ఐసీ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజు ప్రారంభించారు.
అనంతరం పేర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ వారోత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ‘జీవన్ షగున్’ అనే నూతన పాలసీ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పాలసీలో ఎనిమిది సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వారు చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. పాలసీ వ్యవధి 12 సంవత్సరాలు ఉంటుందన్నారు.
ఈ పాలసీలో సింగిల్ ప్రీమియంలో నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కనీసం బీమా మొత్తం రూ. 60వేలుగానూ, గరిష్ట బీమాకు పరిమితి లేదన్నారు. 12 సంవత్సరాల వరకు ఈ పాలసీ ఉంటుందని, పాలసీదారుడు చెల్లించిన ప్రీమియంకు 10 రెట్లు అదనంగా చెల్లించనున్నట్లు చెప్పారు. మచిలీపట్నం డివిజన్ 2013-14 సంవత్సరంలో సౌత్ సెంట్రల్ జోన్‌లోనే 2వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.
డివిజన్ కార్యాలయం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ. 25 లక్షలను కేటాయించినట్లు చెప్పారు. జీవిత బీమా సంస్థ మెచ్యూరిటీ క్లయిమ్, డెత్ క్లయిమ్‌లు చెల్లించడంలో ముందంజలో ఉందని వివరించారు. 6వ తేదీ వరకు ఎల్‌ఐసీ బీమా వారోత్సవాలు జరుగుతాయని, ముగింపు కార్యక్రమం మచిలీ పట్నంలోని టౌన్‌హాలులో జరుగుతుందని చెప్పారు. మార్కెటింగ్ మేనేజర్లు తపన్‌కుమార్‌పట్నాయక్, సేల్స్ మేనేజర్లు ఎంవి.రమణ, ఆదినారాయణ, పీఅండ్‌ఐఆర్ మేనేజరు కె.నాగేశం తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐసీ సేవలు మరింత విస్తృతం
Published Tue, Sep 2 2014 1:31 AM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM
Advertisement