
సాక్షి, తిరుమల: తిరుమలలోని హోటళ్లలో మరోసారి నిర్లక్ష్యం బయటపడింది. కొండపైన ఉన్న నందకం సమీపంలోని లక్ష్మీనారాయణ హోటల్‌లో గురువారం ఓ భక్తుడు టిఫిన్ చేస్తుండగా సాంబారులో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో షాక్‌కు గురైన భక్తుడు.. హాటల్ నిర్వాకంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు హోటల్ ను సీజ్ చేసి.. టిఫిన్ శాంపిల్స్‌లను పరీక్షల నిమిత్తం పంపారు. ప్రస్తుతం భక్తుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు వ్యక్తి నిజామాబాద్ చెందిన వారని అధికారులు తెలిపారు.