ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: చంద్రబాబు | Loan Rescheduling announcement with in one or two days, Chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: చంద్రబాబు

Published Wed, Jul 16 2014 6:28 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: చంద్రబాబు - Sakshi

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: చంద్రబాబు

రైతు రుణ మాఫీ చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్సష్టం చేశారు. అందుకోసం సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న బాబు బుధవారం మాట్లాడుతూ...  రేపో మాపో రుణాల రీషెడ్యూల్పై ప్రకటన విడుదల అవుతుందన్నారు. రీషెడ్యూల్లో కూడా సమస్య ఉందని చెప్పారు. 12 శాతం వడ్డి కట్టాల్సి ఉందన్నారు. ఈ భారాన్ని ఎలా భరించాలన్నది ఆలోచిస్తున్నట్లు బాబు వివరించారు.

 

ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హమీలపై ఆలోచనలతో నిద్ర పోవడం లేదన్నారు. అందరూ అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల రుణాల రీషెడ్యూల్పై సానుకూలంగా ఉన్నట్లు ఆర్బీఐ తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో రీషెడ్యూల్పై ప్రకటన విడుదల కానుందని చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement