'రుణమాఫీకి బాబు ఆస్తులు తనఖా పెడితే చాలు'
రుణమాఫీపై చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. బాబు తన ఆస్తులు తనఖా పెడితే రుణాలన్నింటినీ తీర్చొచ్చని, అందరికీ పింఛన్లు ఇవ్వచ్చని ఆయన అన్నారు. బాబు హయాంలో ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయని, ప్రైవేట్ సంస్థలు మాత్రమే బాగుపడ్డాయని చెప్పారు.
చిత్తూరు డెయిరీని మూతపడేలా చేసిన చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీని మాత్రం లాభాల్లో నడుపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాలు మార్చుకుని, రైతులకు మేలుచేయడానికి ప్రయత్నించాలని చెవిరెడ్డి తెలిపారు.