పాతూరు (భీమడోలు) : ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టిన ఘటనలో లారీ డ్రైవర్ దుర్మరణం చెందగా క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారి సూరప్పగూడెం శివారు పాతూరు వద్ద గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఐరన్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో మరో లారీని ఢీకొట్టగా అతను క్యాబిన్‌లో ఇరుక్కుపోయూడు. అతడిని రక్షించేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మృతుడు చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు సమీపంలోని బూసనత్తం గ్రామానికి చెందిన జడపల్ల వెంకటేశులు (38). వివరాలు ఇలా ఉన్నాయి..
జడపల్ల వెంకటేశులు సొంత లారీలో ఐరన్ లోడుతో విశాఖ నుంచి ఒంగోలు వెళుతున్నాడు. అతని మేనల్లుడు సూరా వెంకటేశులు లారీ క్లీనర్‌గా ఉన్నాడు. మార్గమధ్యలో పాతూరు వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఐరన్‌లోడు క్యాబిన్‌లోకి చొచ్చుకొచ్చింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జుకాగా డ్రైవర్ వెంకటేశులు క్యాబిన్‌లో ఇరుక్కుపోయూడు. కొద్దిసేపు ప్రాణాలు కాపాడండంటూ ఆర్తనాదాలు చేశాడు.
సమాచారం తెలుసుకున్న ఎస్సై బి.వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని సిబ్బంది, స్థానికులు సహాయంతో వెంకటేశులను రక్షించేందుకు ప్రయత్నించారు. పొక్లయిన్ సాయంతో క్యాబిన్‌ను విడగొట్టేందుకు ప్రయత్నించినా వెంకటేశులు ప్రాణాలను కాపాడలేకపోయూరు. క్లీనర్ సూరా వెంకటేశులకు గాయూలయ్యూరుు. ప్రమాదానికి కారణమైన రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ డ్రైవర్ దుర్మరణం
Published Fri, Jun 12 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement