అవినీతి నిరోధక శాఖ కర్నూలు రేంజ్ డీఎస్పీగా మహబూబ్ బాషా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడటంతో సోమవారం సాయంత్రం ఆయన విధుల్లో చేరారు
కర్నూలు, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ కర్నూలు రేంజ్ డీఎస్పీగా మహబూబ్ బాషా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడటంతో సోమవారం సాయంత్రం ఆయన విధుల్లో చేరారు. ఇది వరకు డీఎస్పీగా పని చేసిన లక్ష్మీపతి విజయనగరానికి బదిలీ కావడంతో హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న మహబూబ్ బాషాను కర్నూలుకు బదిలీ చేశారు. ఈయన 2008 నుంచి 2010 వరకు కర్నూలు ఏసీబీ విభాగంలో సీఐగా పని చేశారు. 1989లో కర్నూలు జిల్లా నుంచి ఎస్‌ఐగా ఎంపికై పాణ్యంలో శిక్షణ పొందారు. ప్రొబేషన్ కాలం పూర్తయిన తర్వాత క్రిష్ణగిరి, గోనెగండ్ల పోలీస్ స్టేషన్లలో పని చేశారు. కర్నూలు స్పెషల్ బ్రాంచ్ విభాగంలో మూడు సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించారు. 2001లో సీఐగా పదోన్నతి పొంది హైదరాబాద్‌లోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో.. 2010లో కడప సీసీఎస్‌లో పని చేశారు. జూన్ 13, 2011న డీఎస్పీగా పదోన్నతి పొంది కర్నూలు ఇంటెలిజెన్స్ విభాగంలో పది నెలల పాటు పని చేసి హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీపై వెళ్లారు. తాజాగా కర్నూలు ఏసీబీ విభాగానికి డీఎస్పీగా నియమితులయ్యారు.
అవినీతి అధికారుల సమాచారం ఇవ్వండి: ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలందించడానికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తక్షణమే తన నెంబర్ 94404 46178, లేదా సీఐలు 94404 46129(క్రిష్ణారెడ్డి), 94906 11024(ప్రసాదరావు), 94405 75465(నాగరాజు యాదవ్), 08518-273783 కార్యాలయం నంబర్లకు ఫోన్లు చేసి అవినీతి అధికారుల సమాచారం తెలియజేయాలని ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా కోరారు.