mahaboob basha
-
కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..!
సాక్షి, కడప: జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. బోయినపల్లి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న మహబూబ్ బాషా (20) శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఉండగానే విషం తాగినట్లు తెలుస్తోంది. అయితే, సత్వరమే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదనీ, వైద్యుల నిర్లక్ష్యమే బాషా ప్రాణాలు తీసిందని అతని స్నేహితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి జైలుశిక్ష
నల్లచెరువు (కదిరి) : మద్యం తాగి ఆటో నడుపుతూ నల్లచెరువు మండలం ప్యాయలవాండ్లపల్లి వద్ద పోలీసులకు పట్టుబడిన కె.పూలకుంటకు చెందిన మహబూబ్‌బాషాకు జైలు శిక్ష పడింది. నాలుగు రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని ఎస్ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. -
ఏసీబీ వలలో రెవెన్యూ సిబ్బంది
డోన్‌టౌన్: డోన్‌లో సోమవారం లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపిన మేరకు..డోన్ మండలం నక్కలవాగుపల్లె గ్రామ డీలర్ చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ దుకాణాన్ని 20 రోజుల క్రితం ఆర్ఐ రాజేశ్వరి, వీఆర్వో రాజు తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వకుండా ఉండాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి దఫాగా డీలర్ రూ.5 వేలు చెల్లించాడు. ఆ తర్వాత డిప్యూటీ తహశీల్దార్ జయంతికి కూడా రూ.15 వేలు ఇవ్వాలని, లేదంటే లెసైన్స్ రద్దు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. విసిగిపోయిన డీలర్ చంద్రశేఖరరెడ్డి తన సోదరుడు రమణారెడ్డితో కలసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం డీలర్ నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా డీటీ, ఆర్ఐ, వీఆర్వోలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆర్ఐ రాజేశ్వరి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. లంచం తీసుకున్నట్లుగా నిర్ధారించిన రంగు నీళ్ల సీసాను అధికారుల కళ్లెదుటే ధ్వంసం చేసి కార్యాలయంలోని మరో వాకిట్లో పరారయ్యేందుకు యత్నించగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో సీఐలు ప్రసాద్‌రావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాగా.. పౌరసరఫరాల శాఖ గోదాములో సరుకుల రవాణాపై ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో కూడా భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. -
ఏసీబీ డీఎస్పీగా మహబూబ్ బాషా
కర్నూలు, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ కర్నూలు రేంజ్ డీఎస్పీగా మహబూబ్ బాషా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడటంతో సోమవారం సాయంత్రం ఆయన విధుల్లో చేరారు. ఇది వరకు డీఎస్పీగా పని చేసిన లక్ష్మీపతి విజయనగరానికి బదిలీ కావడంతో హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న మహబూబ్ బాషాను కర్నూలుకు బదిలీ చేశారు. ఈయన 2008 నుంచి 2010 వరకు కర్నూలు ఏసీబీ విభాగంలో సీఐగా పని చేశారు. 1989లో కర్నూలు జిల్లా నుంచి ఎస్ఐగా ఎంపికై పాణ్యంలో శిక్షణ పొందారు. ప్రొబేషన్ కాలం పూర్తయిన తర్వాత క్రిష్ణగిరి, గోనెగండ్ల పోలీస్ స్టేషన్లలో పని చేశారు. కర్నూలు స్పెషల్ బ్రాంచ్ విభాగంలో మూడు సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించారు. 2001లో సీఐగా పదోన్నతి పొంది హైదరాబాద్‌లోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో.. 2010లో కడప సీసీఎస్‌లో పని చేశారు. జూన్ 13, 2011న డీఎస్పీగా పదోన్నతి పొంది కర్నూలు ఇంటెలిజెన్స్ విభాగంలో పది నెలల పాటు పని చేసి హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీపై వెళ్లారు. తాజాగా కర్నూలు ఏసీబీ విభాగానికి డీఎస్పీగా నియమితులయ్యారు. అవినీతి అధికారుల సమాచారం ఇవ్వండి: ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలందించడానికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తక్షణమే తన నెంబర్ 94404 46178, లేదా సీఐలు 94404 46129(క్రిష్ణారెడ్డి), 94906 11024(ప్రసాదరావు), 94405 75465(నాగరాజు యాదవ్), 08518-273783 కార్యాలయం నంబర్లకు ఫోన్లు చేసి అవినీతి అధికారుల సమాచారం తెలియజేయాలని ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా కోరారు.