తమన్నా భేల్పూరిలా ఉంది | Mahesh Babu describes Tamanna as 'bhelpuri' | Sakshi
Sakshi News home page

తమన్నా భేల్పూరిలా ఉంది

Published Sun, Sep 21 2014 12:25 PM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

తమన్నా భేల్పూరిలా ఉంది

తమన్నా భేల్పూరిలా ఉంది

టాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్లను హీరోలు రకరకాలుగా వర్ణించడం ఇంకా కొనసాగుతునే ఉంది. అదీ మహేష్ బాబు చిత్రాలలో అధికంగా కనబడుతుంది. అందుకు ఇటీవలే విడుదలైన 'ఆగడు' చిత్రమే సాక్షి.  ఆ చిత్రంలో తమన్నాను మనం తీనే ఆహార పదార్ధాల పేర్లతో మరీ అభివర్ణిస్తాడు. ఆమె భేల్ పూరిలా ఉందని... ఆమె పెదాలు మామిడికాయ ముక్కలతో పోల్చాడు. అలాగే సపోటా జ్యూస్, టమాటా జ్యూస్, కుల్ఫీ, బర్ఫీలతో తమన్నాను మహేష్ బాబు ఆగడు సినిమాలోని ఓ పాటలో పోలుస్తాడు.  ఈ పాటను బాస్కరభట్ల రవికుమార్ రాయగా ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు.

ప్రిన్స్ మహేష్ బాబు ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు తీసుకుంటే... హీరోయిన్లను రకరకాల పేర్లతో పోల్చడం గమనించవచ్చు. ఉదాహరణకు దూకుడు చిత్రంలో హీరోయిన్ సమాంతాను పిట్ట మోహం అంటు ఆటపట్టిస్తాడు. మహేష్ బాబు నటించిన చిత్రాలలోని మాటల్లో, పాటల్లో ఇటు వంటి పదాలు అధికంగా వినిపిస్తాయి. ఆగడు సినిమాలోని మొత్తం ఎనిమిది పాటల్లో తన కుమారుడు గౌతమ్కు భేల్పూరీ పాట అత్యంత ఇష్టమని మహేష్ బాబు చెప్పారు. గౌతమ్ ఆ పాటనే అనేక సార్లు వింటున్నాడని గత నెల 31న హీరో మహేష్ బాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement