పోలీస్‌గా కనిపిస్తా...
Published Mon, Jan 6 2014 12:15 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
‘తమన్నా పని అయిపోయినట్టే... తట్టా బుట్టా సర్దుకొని ఇక ముంబయ్ చెక్కేయడమే తరువాయి’ అని అనుకున్న వారందరికీ భారీ లెవెల్లో షాక్ ఇచ్చారు తమన్నా. ఒక్కసారిగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో బిజీ అయిపోయి... సాటి హీరోయిన్లకి సవాల్ విసిరారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో ఓ సినిమా, సైఫ్ ఆలీఖాన్‌తో మరో సినిమా. తెలుగులో ఆగడు, బాహుబలి, కోలీవుడ్‌లో అజిత్‌తో ‘వీరమ్’... అన్నీ ప్రతిష్టాత్మక చిత్రాలే . ఇదిలావుంటే... ఇటీవల తమన్నా తన పారితోషికం అమాంతం పెంచేసిందని, ఓ తెలుగు నిర్మాత తన సినిమాలో నటింపజేయడానికి తమన్నాని సంప్రదించగా... పారితోషికాన్ని భారీగా పెంచేసి చెప్పిందని, దాంతో ఖంగుతిన్న ఆ నిర్మాత చక్కా పోయాడని ఓ వార్త, ఫిలింనగర్‌లో షికారు చేస్తోంది.
దీనిపై ఇటీవల తమన్నాను వివరణ అడగ్గా... ‘‘నేను ఫుల్ ఫామ్‌లో ఉన్న రోజుల్లోనే పారితోషికం పెంచలేదు. నాకు ఎంత ఇస్తే కరెక్టో నా నిర్మాతలకు తెలుసు. అయినా... ప్రస్తుతం నేనున్న బిజీలో కొత్త సినిమాను ఒప్పుకోలేను. ఈ విషయంపై నన్నెవరూ సంప్రదించలేదు కూడా’’అని చెప్పారు. ‘ఆగడు’లో పోలీస్ పాత్ర చేస్తున్నారటగా.. అనడిగితే- ‘‘అందులో నేను పూర్తిస్థాయి పోలీస్‌నా, లేక.. ఆ గెటప్‌లో కాసేపు సరదాగా కనిపిస్తానా అనేది ప్రస్తుతం మాత్రం సస్పెన్స్. అయితే, నా పాత్ర మాత్రం ‘ఆగడు’లో చాలా సరదాగా ఉంటుంది. తొలిసారి పోలీస్ గెటప్‌లో కనిపించడం మాత్రం ఉద్వేగంగానే ఉంది’’ అని చెప్పుకొచ్చారు తమన్నా.
Advertisement
Advertisement