
తాడేపల్లి :
►నేడు రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా నగదు జమ
నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
తొలివిడతగా నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,800 కోట్లు జమ
ప్రతి రైతు కుటుంబానికి తొలివిడతగా రూ.7,500 జమ
ఈసారి 49.43 లక్ష కుటుంబాలకు పెట్టుబడి సాయం
ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం
హైదరాబాద్ :
►నేడు కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
మ.2 గంటలకు కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చ
విశాఖ :
►గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో 6 చోట్ల వైద్య శిబిరాలు
మరో వారం రోజుల్లో వైఎస్ఆర్ క్లినిక్ పేరిట ప్రత్యేక వైద్యశాల
గోపాలపట్నం ఏరియా ఆస్పత్రిలో 10 వెంటిలేటర్లతో వైద్య సదుపాయాలు
ప్రతి వ్యక్తికి 5 రకాల పరీక్షలు చేయాలని వైద్య నిపుణుల కమిటీ నిర్ణయం
►నేడు ఐసీఎంఆర్ ప్రతినిధుల సీరం ప్రివిలెన్స్ సర్వే
నల్లగొండ, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో..
ర్యాండమ్‌గా శాంపిల్స్ సేకరించనున్న ఐసీఎంఆర్ ప్రతినిధులు
ఢిల్లీ :
►నేడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం
నాలుగో దశ లాక్‌డౌన్ సడలింపులు, కరోనా నియంత్రణపై చర్చ
►దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 78 వేలు
ఇప్పటివరకు కరోనాతో 2549 మంది మృతి
కరోనాతో కోలుకున్న వారు 26,234మంది
►ప్రపంచవ్యాప్తంగా 45.20 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3.03 లక్షల మంది మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో కోలుకున్న 17.01 లక్షల మంది