కడప రూరల్ : జిల్లాలో మే 1 నుంచి పిం ఛన్ల పంపిణీలో పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడి యో కాన్ఫరెన్స్ హాలులో పింఛన్ల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమం తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి పంచాయతీలో హ్యాబిటేషన్ ప్రకారం పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలన్నారు.
మే 2 నుంచి 11వ తేది వరకు నీరు-చెట్టు కార్యక్రమం జరుగుతున్నందున రోజువారి కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇరిగేషన్ అదికారులు, ఎం పీడీఓలు నిర్వహించాలని ఆదేశించారు. నీరు-చెట్టు కార్యక్రమం జరిగే ముందు గ్రామంలో ప్రజలకు తెలిసేలా బహిరంగ పర్చాలన్నారు. ఉపాధి హామి పథ కం కింద కూలీలకు ఎక్కువ పనులు కల్పించాలన్నారు. గ్రామంలో ఎన్ని చెరువులున్నాయి? వాటినన్నింటికీ మరమ్మతులు చేయించాలన్నారు. ఓటరుకార్డుకు ఆధార్ ఎంట్రీ మే 10లోపు పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో వాల్టా చట్టాన్ని అతిక్రమించి బోరువేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో మే నెలలో 496 ఈ-పాస్ యంత్రాల ద్వారా డీలర్లు వంద శాతం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాల సుబ్రమణ్యం, వెంకట సుబ్బయ్య, ఇరిగేషన్ ఎస్‌ఈ శంకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఈశ్వరయ్య, డీఆర్వో సులోచన, కమిషనర్‌ఓబులేశు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులు, సీపీఓ తిప్పేస్వామి, డీపీఓ అపూర్వసుందరి తదితరులు పాల్గొన్నారు.
పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయండి
Published Wed, Apr 29 2015 4:09 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement